రూ.2,500..120 కి.మీ.
జమ్మికుంట: ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకునేందుకు ఈ వ్యక్తి 120 కి.మీ. తిరగాల్సి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల గ్రామానికి చెందిన జక్కుల కుమార్ తన గొలుసు మణప్పురం ఫైనాన్‌సలో తాకట్టు పెట్టి రూ.40 వేలు తీసుకున్నాడు. గురువారం రూ.1,975 వడ్డీ చెల్లించాలని, లేకుంటే గొలుసు వేలం వేస్తామంటూ బుధవారం ఆయనకు ఫోన్ వచ్చింది.
చేతిలో రద్దైన నోట్లు ఉండడంతో వాటిని టేకుమట్ల ఆంధ్రాబ్యాంక్‌లో జమ చేశాడు. తిరిగి కొత్త నోట్లు తీసుకుందామంటే బ్యాంకులో లేవు. ఏటీఎంకు తాళం వేశారు. అక్కడ్నుంచి భూపాలపల్లికి వెళ్తే అక్కడా నిరాశే ఎదురైంది. దీంతో అక్కడ్నుంచి జమ్మికుంట చేరుకుని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ.2,500 డ్రా చేసుకున్నాడు. మొత్తమ్మీద 120 కి.మీ. తిరిగితేగానీ 2,500 చేతికి రాలేకపో యాయంటూ కుమార్ ఆవేదన చెందాడు.