అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా): దైవ దర్శనానికి వెళుతుండగా ట్రాలీ ఆటో బోల్తా పడి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద జరిగింది.
ఖమ్మం సరిహద్దులో ఉన్న గుబ్బల గంగమ్మ దేవతను దర్శించుకునేందుకు ఎరుపాళెం గ్రామానికి చెందిన 20 మంది ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో నారంవారిగూడెం వద్దకు రాగానే బోల్తాపడింది. ఈ సంఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ట్రాలీ ఆటో బోల్తా: 15 మందికి తీవ్రగాయాలు
Published Sun, Oct 11 2015 8:08 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM
Advertisement
Advertisement