18,514మందికి కరోనా పరీక్షలు | 18514 People Underwent Coronary Diagnosis Tests In Telangana | Sakshi
Sakshi News home page

18,514మందికి కరోనా పరీక్షలు

Published Sun, Apr 26 2020 1:04 AM | Last Updated on Sun, Apr 26 2020 5:06 AM

18514 People Underwent Coronary Diagnosis Tests In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు 990కి చేరుకున్నాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్, సూర్యాపేట, వికారాబాద్, నిజామాబాద్, గద్వాల, వరంగల్‌ అర్బన్, కరీంనగర్‌ జిల్లాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల ప్రజలను ఈ వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. విదేశాల నుంచి వచ్చినవారు, వారి కాంటాక్టుల ద్వారా కొద్ది మందికి పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు, వారి కాంటాక్టుల ద్వారానే 900కు పైగా పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో 18,514 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 462 పరీక్షలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇది రోజురోజుకూ మారుతోందని పేర్కొంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎప్పటికప్పుడు వివిధ వైరాలజీ ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఓ వైద్యాధికారి వెల్లడించారు. దేశ సగటు కంటే తెలంగాణలో కరోనా పరీక్షలు ఎక్కువగానే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఆ లింక్‌ల పరీక్షలు పూర్తి! 
ఇప్పటివరకు రాష్ట్రంలో విదేశాల నుంచి, మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు పూర్తయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అక్కడక్కడ రెండో కాం టాక్టులకు పరీక్షలు చేసినా, రెండ్రోజుల నుం చి వాటిని నిలిపేసిన సంగతి తెలిసిందే. సెకం డరీ కాంటాక్టుల్లో ఎవరికైనా లక్షణాలుంటేనే వైద్య పరీక్షలు చేస్తారు. లేకుంటే వారందరినీ హోం క్వారంటైన్‌లో 28 రోజులు ఉంచు తారు. ఆ హోం క్వారంటైన్‌ కాలంలో ఎవరికై నా లక్షణాలు బయటపడితే అప్పుడు వారికి వైద్య పరీక్షలు చేస్తారు. అయితే ప్రస్తుతం కరోనా నిర్ధారణకు వచ్చే శాంపిళ్లన్నీ మర్కజ్‌తో, విదేశాల నుంచి వచ్చిన వారితో నేరుగా సంబంధం లేనివని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం వస్తున్న కేసుల్లో ఎక్కువగా సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఇతర అనుమా నాలతో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వస్తున్నారని పేర్కొంటున్నారు. అలాగే రోజూ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి 50 నుంచి 60 మంది వరకు అనుమానిత లక్షణాలతో కరోనా నిర్ధారణ పరీక్షలకు వస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే వారిలో కొందరికి పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా యి. మరి వారికి ఎవరి ద్వారా, ఎలా వచ్చిందన్న దానిపై వైద్యాధికారులకు అంతుచిక్కట్లేదు. చదవండి: టిమ్స్‌ ఆస్పత్రికి రూ. 25 కోట్లు 

పాజిటివ్‌ కేసులు తగ్గే అవకాశం.. 
రెండో కాంటాక్టులకు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేయొద్దన్న నిర్ణయంతో ఇక నుంచి పరీక్షల సంఖ్య తగ్గే అవకాశముంది. దీంతో సహజంగానే పాజిటివ్‌ కేసులు కూడా తగ్గుతాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత రెండ్రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ఇదే కారణంగా చెబుతున్నారు. మర్కజ్, విదేశీ పాజిటివ్‌లతో లింక్‌ లేని వారు వస్తున్నందున పెద్దగా కేసులు నమోదు కాకపోవచ్చని పేర్కొంటున్నారు.   

కొత్తగా ఏడు కేసులు 
► జీహెచ్‌ఎంసీలో ఆరు, వరంగల్‌ అర్బన్‌లో ఒకటి 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు కరోనా కేసుల సం ఖ్య తగ్గింది. శనివారం కొత్తగా 7 మాత్రమే పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అందులో 6 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే నమోదయ్యాయి. మరో కేసు వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. శనివారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు మొత్తం 990కు చేరుకుంది. తాజాగా 16 మంది కోలుకోగా, ఇప్పటివరకు 307 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇప్పటివరకు 25 మంది వైరస్‌ కారణంగా చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 658 మంది చికిత్స పొందుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement