బాలానగర్ : అప్పు చేసి వేసిన పంట పండకపోవడంతో మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తిరుమలపూర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తిరుమలపూర్‌కు చెందిన కావలి కొండయ్య (45) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో, కౌలుకు తీసుకున్న మరో నాలుగు ఎకరాల్లో మక్క, పత్తి పంటను అప్పులు చేసి వేశాడు. పంట పండకపోవడంతో మనస్థాపం చెందిన కొండయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యతో కుటుంబ కన్నీరు మున్నీరైంది.
మరోవైపు రంగారెడ్డి జిల్లా మోమిన్ పేటలో గురువారం ఉదయం అప్పుల బాధతో ఓ రైతుకూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక బాలిరెడ్డిగూడెంకు చెందిన రైతుకూలీ చిన్నరామయ్య కొన్ని రోజులుగా పనులు లేక అప్పులు పాలయ్యాడు. దీంతో మనస్తాపంతో ఈ రోజు గుళికలు మింగ ఆత్మహత్య చేసుకున్నాడు.