
ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో 24 అంతస్థులు!
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో 24 అంతస్థులతో ట్విన్ హాస్పటల్ టవర్స్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సుదీర్ఘ చర్చ జరిపారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులతో ఆయన దాదాపు ఆరు గంటలసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యసేవలు ఆధునీకరించాలని తీర్మానించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకలతో అత్యాధునిక ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించారు.