ఖానాపూర్(నిర్మల్ జిల్లా): ఖానాపూర్ మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్దినులు మంగళవారం అదృశ్యమయ్యారు. గురుకుల పాఠశాల హాస్టల్ గది కిటీకీ నుంచి దూకి పారిపోయారు. పారిపోయిన విద్యార్థునులు ఆశ్రియ, మైత్రి, సహస్రికలుగా గుర్తించారు. వీరంతా ఆరో తరగతి చదువుతున్నారు. హాస్టల్ నుంచి పారిపోయిన వారు ఇంటికి కూడా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.