'ప్లీనరీకి 36 వేల మంది హాజరవుతారు' | 36 thousand leaders and workes attends trs plenary, says Palla Rajeshwar Reddy | Sakshi
Sakshi News home page

'ప్లీనరీకి 36 వేల మంది హాజరవుతారు'

Published Tue, Apr 7 2015 12:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

36 thousand leaders and workes attends trs plenary, says Palla Rajeshwar Reddy

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 24న చేపట్టనున్న ప్లీనరీ సమావేశానికి 36 వేల మంది హాజరవుతారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... 24వ తేదీ సాయంత్రం అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు.

టీఆర్ఎస్ కొత్త అధ్యక్ష ఎన్నికల అధికారిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని చెప్పారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారన్నారు. అలాగే ఈనెల 27న పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement