TRS Plenary 2015
-
ఆయన 'పంచ్' వేస్తే..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్... ప్లీనరీలో తనదైన శైలిలో పడికట్టు పదాలతో, పంచ్ డైలాగులతో సభకు హాజరైనవారిని ఆకట్టుకున్నారు. * రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో 'కోతులుండే జాగాను మనం ఖరాబు చేస్తే.. మనం ఉండే జాగాలకచ్చి అవి మన పంటలను ఖరాబు చేస్తున్నాయి. అందుకే ప్రతి గ్రామంలో వేలాదిగా చెట్లు నాటాలి..'అని సూచించారు. * కరెంట్ కోతలపై విపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. 'మేం అధికారం చేపట్టి గోచిగూడా సర్దుకోకముందే ఆందోళన చేస్తున్నరు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో లాంతర్లు, ఎండిన వరి కంకులు తేకుండా పంటలకు నీళ్లిచ్చినం..'అన్నారు. * పలువురు మంత్రులు తీర్మానం సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించడంతో.. 'మనం నాయకులం సమయం విషయంలో సోయి ఉండాలె. కార్యకర్తలందరూ చాలా దూరం పోవాలె. పెద్ద అంశమైతే ఏడు నిమిషాలు, చిన్న తీర్మానమైతే మూడు నిమిషాల్లో ప్రసంగాలను ముగించండి..'అని కేసీఆర్ సూచించారు. కానీ పలువురు మంత్రులు పది నిమిషాలకు పైగా ప్రసంగం కొనసాగించారు. * విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఆ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని 'ఇక నుంచి కరెంట్ రెడ్డి అని పిలవాల'న్నారు. * సభా ప్రాంగణంలో కేసీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన చిన్నపాటి తోరణాలను చించుకునేందుకు కార్యకర్తలు పోటీపడడంతో కేసీఆర్ వారినుద్దేశిస్తూ.. 'సభ అయిపోయినంక ఎవరికి దమ్ముంటే వారు పీక్కోని పోండి.. అప్పటివరకు ఆగండి..' అని తనదైన శైలిలో చెప్పారు. ప్లీనరీ సైడ్‌లైట్స్.. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఆద్యంతం కళాకారుల పాటలు, కేసీఆర్ మార్కు పంచ్ డైలాగులు, కార్యకర్తల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో సందడిగా జరిగింది. అందులో పలు అంశాలు సభకు హాజరైనవారిని బాగా ఆకట్టుకున్నాయి. * టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక వద్దకు రాగానే కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన కార్యకర్తలకు అభివాదం చేసి వేదికపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కేసీఆర్‌కు దట్టీ కట్టారు. * టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్‌ను ప్రకటించిన సమయంలో వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల నుంచి గులాబీ పూలవర్షం కురిపించారు. * వేదికతో పాటు మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు కూర్చున్న గ్యాలరీలపై పూలవర్షం కురవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమయంలో కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చారు. * వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం గిరిజన సంస్కృతిని ప్రతి బింబించేలా ఏర్పాటు చేసిన డమరుకాన్ని కేసీఆర్ మో గించడం ఆకట్టుకుంది. ఇదే సమయంలో ‘గులాబీ జెండా లు ఎగరాలి.. ద్రోహుల గుండెలు అదరాలి..’ అంటూ పాటరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. * టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నాయిని నరసింహారెడ్డి ప్రకటించిన అనంతరం కళాకారులు ఆలపించిన ‘సల్లంగుండాలయ్యా.. మాసారూ కేసీఆరూ.. మీరు పైలం గుండాలయ్యా మా ముఖ్యమంత్రిగారు..’ అన్న పాట బాగా ఆకట్టుకుంది. * కేసీఆర్‌కు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బోనం ఆకారంలో ఉన్న కళాకృతిని ఇచ్చి శిరస్సుపై పగిడి పెట్టి సన్మానించారు. * కొందరు మహిళలు బతుకమ్మలు పేర్చుకొని వచ్చి కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. * కేసీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ.. అడిగి మరీ కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించారు. ప్లీనరీ తీర్మానాల ఆమోదం సమయంలోనూ గట్టిగా చప్పట్లు కొట్టాలని పదేపదే కార్యకర్తలను కోరారు. వేదికపైనున్న ముఖ్య నేతలు సైతం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరడం గమనార్హం. * త్వరలో పార్టీ కార్యకర్తలకు పదవుల పందేరం మొదలుపెడతామని, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేయరాదని సీఎం సూచించినపుడు కార్యకర్తల చప్పట్లు, ఈలలతో ప్రాంగణం మారుమోగింది. * కేసీఆర్ పలువురు నాయకులపై పంచ్ డైలాగులు విసిరి అందరినీ నవ్వించారు. కార్యసాధకుడు లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగడంటూ ఓ పద్యం వినిపించడం ఆకర్షించింది. * అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ను సన్మానించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీపడ్డారు. ఈ సమయంలో వేదిక కిక్కిరిసిపోవడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని అందరినీ కిందకు పంపించివేశారు. * ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్లు తరచూ ఆగిపోవడంతో కార్యకర్తలు ప్లకార్డులతో విసురుకోవడం కనిపించింది. వేదికపై ఉన్న మంత్రులు సైతం ఉక్కపోత భరించలేక పార్టీ కరపత్రాలతో విసురుకున్నారు. * వేదికపై నుంచి ఎమ్మెల్యే, సినీనటుడు బాబూమోహన్, ఎంపీ కవిత మహిళలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. * మంత్రులు హరీశ్, కేటీఆర్‌ల ప్రసంగాల సమయంలో చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. * 'తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవడంతో మా కల నిజమైం ద’ంటూ కళాకారులు ఓ పాట పాడిన సమయంలో కేసీఆర్.. ‘ఇది డబ్బాగొట్టే పాట' అంటూ నవ్వించారు. ఉద్యమ సమయంలో తన జీపుపై నుంచి జెతైలంగాణ నినాదాలు చేసిన స్వీటీ అనే బాలిక .. సభకు వచ్చి తాను పైలట్ అయ్యేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని వేదికపైకి ఎక్కి సీఎంకు వినతిపత్రం సమర్పించింది. దీంతో ఆయన ఆ బాలికకు ఎంత ఖర్చైనా ఇచ్చి పైలట్ చేస్తామని చెప్పి, అందరితో చప్పట్లు కొట్టించడం ఆకట్టుకుంది. -
విశ్వనగరంగా రాజధాని : కేసీఆర్
⇒ మరో రింగ్‌రోడ్డు, విమానాశ్రయాల నిర్మాణం ⇒ మెట్రో రైలు మార్గం విస్తరణ ⇒ నగరంలో వెయ్యి కూరగాయల మార్కెట్లు ⇒ టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానం సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక సాక్షిగా గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ‘విశ్వనగరంగా హైదరాబాద్’ అన్న తీర్మానాన్ని కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించారు. మెట్రో రైలు మార్గాలను భవిష్యత్తులో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, బీహెచ్ఈఎల్ (రామచంద్రాపురం), ఇబ్రహీంపట్నం వరకు పొడిగిస్తామని సీఎం ప్రకటించారు. కోటి జనాభాకు చేరువైన మహా నగరంలో వెయ్యి కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వర్షం పడితే హైదరాబాద్‌లో కార్లు పడవ లు అవుతున్నాయని... ఈ పరిస్థితికి గత పాలకులే కారణమని విమర్శించారు. ఇది ఏ హైటెక్ పాలనకు నిదర్శనమని విపక్షాలను దెప్పిపొడిచారు. నాలాల కబ్జాతో పాటు కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల కాలం నాటి మురుగునీరు, వరదనీటి కాల్వల వ్యవస్థను గత పాలకుల హయాంలో ధ్వంసం చేశారని ఆక్షేపించారు. నగరంలోని శ్మశాన వాటికలను సైతం అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందిరాపార్క్ సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో కళాభారతిని ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పూర్తి చేస్తామని... నగరంలో మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం చెప్పారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ. నగరంలో స్కైవేల నిర్మాణానికి ముంబయికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో నగరం ఐటీ హబ్‌గా మారుతుందని తెలిపారు. ‘విశ్వనగరం’ తీర్మాన సారాంశం... ‘శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్... అన్ని జాతులు, మతాలు, భాషా సంస్కృతుల సహజీవన కేంద్రం. కాస్మోపాలిటన్ సిటీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. సమశీతోష్ణ వాతావరణం, ప్రకృతి విపత్తులు సంభవించని పర్యావరణం ఈ నగరం సొంతం. అసఫ్‌జాహీల కాలంలోనే హైదరాబాద్ ఆధునిక నగరంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఐటీఐఆర్ తో నగరం రెండింతలు విస్తరించే అవకాశం ఉంది. ట్రాఫిక్ నియంత్రణకు మల్టీ గ్రేడ్ సెపరేటర్స్, సూపర్ స్కైవేలు, జంక్షన్ల అభివృద్ధి, సిగ్నల్ ఫ్రీ కారిడార్లు, వేగ నియంత్రణకు స్పీడ్ గన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి అంతర్జాతీయ నగరంగా తీర్దిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర పథకం రూపొందించింది. శాటిలైట్ సిటీల నిర్మాణం, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, మూసీనది ప్రక్షాళన, హుస్సేన్‌సాగర్ శుద్ధి, వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని సరఫరా చేయడం, మెట్రో రైలు మార్గం ద్వారా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడం వంటివన్నీ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు. వీటితో పాటు నగరం చుట్టూ మరొక రింగ్‌రోడ్డును నిర్మించడం, ఇంకోవిమానాశ్రయం ఏర్పాటు, ఎన్టీఆర్ స్టేడియం లో కళాభారతి ఏర్పాటు, నగరంలో పచ్చదనం పెం చేందుకు హరితహారం చేపడతామని తీర్మానంలో పేర్కొన్నారు. కాలుష్య నివారణ, అక్రమ నిర్మాణా లు, ప్రభుత్వ స్థలాల కబ్జాలను నిలువరించడం ప్ర భుత్వం ముందున్న సవాళ్లని తెలిపారు. వీటిని ఎదుర్కొని పరిష్కరించేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ప్రణాళికను ప్రారంభించాలి. అమలుకు చర్యలు చేపట్టాలి. విశ్వనగరంగా హైదరాబాద్‌కు ప్రఖ్యాతి తీసుకురావాల’ని ఈ సభ తీర్మానిస్తున్నది. -
గులాబీ దళం సందడి
నాంపల్లి: టీఆర్ఎస్ ప్లీనరీతో శుక్రవారం హైదరాబాద్‌లో సందడి నెలకుంది. తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది హాజరై ఉంటారని పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. నాయకుల ప్రసంగాలను వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు, లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేశారు. సభలో కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్లీనరీ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ 12 గంటలకు స్టేడియానికి చేరుకున్నారు. ఆయన అందరికి అభివాదం చేయడంతో కార్యకర్తలు పెద్ద పెట్టున జై తెలంగాణ నినాదాలు చేశారు. ఎల్బీ స్టేడియం చుట్టూ వెలసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు కనువిందు చేశాయి. టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించడంతో ఎల్బీ స్టేడియం వద్ద భారీగా బాణసంచా పేల్చారు. కార్యకర్తలకు మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. వంటకాలు సరిపోక వారు కిందా మీద పడ్డారు. నాయకులు ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కొత్తగా హామీలేమీ ప్రకటించకపోవడం విశేషం. సాయంత్రం 6.50 గంటలకు ప్లీనరీ ముగిసింది. హాజరైన ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ బ్యాగ్‌లను పంపిణీ చేసింది. గన్పార్క్వైపు చూడని నేతలు.. తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) వద్దకు ఏ ఒక్క నాయకుడూ రాలేదు. గన్‌పార్క్ చుట్టూ బ్యానర్లు, కేసీఆర్ హోర్డింగ్‌లతో ముంచెత్తారే తప్పా స్థూపాన్ని పూలతో అలంకరించలేదు. అమరులకు ఎల్బీస్టేడియంలో నివాళులర్పించిన నాయకులు, గన్‌పార్క్ వద్దకు మాత్రం రాలేదు. నేతలు గన్‌పార్క్ వద్దకు వస్తారని ఎంతగానో ఎదురుచూసిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. వారు ఎల్బీస్టేడియానికి చేరుకోకతప్పలేదు. నగరం గులాబీ మయం.. ఎల్బీ స్టేడియం బయట, నిజాం కళాశాల, గన్‌ఫౌండ్రీ రోడ్, ఎంజే మార్కెట్, నాంపల్లితో పాటు పలు ప్రాంతాలు టీఆర్ఎస్ జెండాలు, బ్యానర్లతో గులాబీమయమయ్యాయి. స్థానిక నాయకులతో పాటు రాష్ట్ర నాయకుల వరకూ పోటాపోటీగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. -
ప్లీనరీ సైడ్‌లైట్స్..
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఆద్యంతం కళాకారుల పాటలు, కేసీఆర్ మార్కు పంచ్ డైలాగులు, కార్యకర్తల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో సందడిగా జరిగింది. అందులో పలు అంశాలు సభకు హాజరైనవారిని బాగా ఆకట్టుకున్నాయి. * టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక వద్దకు రాగానే కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన కార్యకర్తలకు అభివాదం చేసి వేదికపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కేసీఆర్‌కు దట్టీ కట్టారు. * టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్‌ను ప్రకటించిన సమయంలో వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల నుంచి గులాబీ పూలవర్షం కురిపించారు. * వేదికతో పాటు మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు కూర్చున్న గ్యాలరీలపై పూలవర్షం కురవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమయంలో కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చారు. * వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం గిరిజన సంస్కృతిని ప్రతి బింబించేలా ఏర్పాటు చేసిన డమరుకాన్ని కేసీఆర్ మో గించడం ఆకట్టుకుంది. ఇదే సమయంలో ‘గులాబీ జెండా లు ఎగరాలి.. ద్రోహుల గుండెలు అదరాలి..’ అంటూ పాటరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. * టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నాయిని నరసింహారెడ్డి ప్రకటించిన అనంతరం కళాకారులు ఆలపించిన ‘సల్లంగుండాలయ్యా.. మాసారూ కేసీఆరూ.. మీరు పైలం గుండాలయ్యా మా ముఖ్యమంత్రిగారు..’ అన్న పాట బాగా ఆకట్టుకుంది. * కేసీఆర్‌కు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బోనం ఆకారంలో ఉన్న కళాకృతిని ఇచ్చి శిరస్సుపై పగిడి పెట్టి సన్మానించారు. * కొందరు మహిళలు బతుకమ్మలు పేర్చుకొని వచ్చి కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. * కేసీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ.. అడిగి మరీ కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించారు. ప్లీనరీ తీర్మానాల ఆమోదం సమయంలోనూ గట్టిగా చప్పట్లు కొట్టాలని పదేపదే కార్యకర్తలను కోరారు. వేదికపైనున్న ముఖ్య నేతలు సైతం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరడం గమనార్హం. * త్వరలో పార్టీ కార్యకర్తలకు పదవుల పందేరం మొదలుపెడతామని, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేయరాదని సీఎం సూచించినపుడు కార్యకర్తల చప్పట్లు, ఈలలతో ప్రాంగణం మారుమోగింది. * కేసీఆర్ పలువురు నాయకులపై పంచ్ డైలాగులు విసిరి అందరినీ నవ్వించారు. కార్యసాధకుడు లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగడంటూ ఓ పద్యం వినిపించడం ఆకర్షించింది. * అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ను సన్మానించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీపడ్డారు. ఈ సమయంలో వేదిక కిక్కిరిసిపోవడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని అందరినీ కిందకు పంపించివేశారు. * ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్లు తరచూ ఆగిపోవడంతో కార్యకర్తలు ప్లకార్డులతో విసురుకోవడం కనిపించింది. వేదికపై ఉన్న మంత్రులు సైతం ఉక్కపోత భరించలేక పార్టీ కరపత్రాలతో విసురుకున్నారు. * వేదికపై నుంచి ఎమ్మెల్యే, సినీనటుడు బాబూమోహన్, ఎంపీ కవిత మహిళలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. * మంత్రులు హరీశ్, కేటీఆర్‌ల ప్రసంగాల సమయంలో చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. * ‘తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవడంతో మా కల నిజమైం ద’ంటూ కళాకారులు ఓ పాట పాడిన సమయంలో కేసీఆర్.. ‘ఇది డబ్బాగొట్టే పాట’ అంటూ నవ్వించారు. * ఉద్యమ సమయంలో తన జీపుపై నుంచి జెతైలంగాణ నినాదాలు చేసిన స్వీటీ అనే బాలిక .. సభకు వచ్చి తాను పైలట్ అయ్యేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని వేదికపైకి ఎక్కి సీఎంకు వినతిపత్రం సమర్పించింది. దీంతో ఆయన ఆ బాలికకు ఎంత ఖర్చైనా ఇచ్చి పైలట్ చేస్తామని చెప్పి, అందరితో చప్పట్లు కొట్టించడం ఆకట్టుకుంది. ఆయన ‘పంచ్’ వేస్తే.. ప్లీనరీలో కేసీఆర్ తనదైన శైలిలో పడికట్టు పదాలతో, పంచ్ డైలాగులతో సభకు హాజరైనవారిని ఆకట్టుకున్నారు. * రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో ‘కోతులుండే జాగాను మనం ఖరాబు చేస్తే.. మనం ఉండే జాగాలకచ్చి అవి మన పంటలను ఖరాబు చేస్తున్నాయి. అందుకే ప్రతి గ్రామంలో వేలాదిగా చెట్లు నాటాలి..’ అని సూచించారు. * కరెంట్ కోతలపై విపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ‘మేం అధికారం చేపట్టి గోచిగూడా సర్దుకోకముందే ఆందోళన చేస్తున్నరు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో లాంతర్లు, ఎండిన వరి కంకులు తేకుండా పంటలకు నీళ్లిచ్చినం..’’ అన్నారు. * పలువురు మంత్రులు తీర్మానం సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించడంతో.. ‘మనం నాయకులం సమయం విషయంలో సోయి ఉండాలె. కార్యకర్తలందరూ చాలా దూరం పోవాలె. పెద్ద అంశమైతే ఏడు నిమిషాలు, చిన్న తీర్మానమైతే మూడు నిమిషాల్లో ప్రసంగాలను ముగించండి..’ అని కేసీఆర్ సూచించారు. కానీ పలువురు మంత్రులు పది నిమిషాలకు పైగా ప్రసంగం కొనసాగించారు. * విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఆ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని ‘ఇక నుంచి కరెంట్ రెడ్డి అని పిలవాల’న్నారు. * సభా ప్రాంగణంలో కేసీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన చిన్నపాటి తోరణాలను చించుకునేందుకు కార్యకర్తలు పోటీపడడంతో కేసీఆర్ వారినుద్దేశిస్తూ.. ‘సభ అయిపోయినంక ఎవరికి దమ్ముంటే వారు పీక్కోని పోండి.. అప్పటివరకు ఆగండి..’ అని తనదైన శైలిలో చెప్పారు. అలరించిన ఆటా పాట ప్లీనరీ ప్రధాన వేదికకు ఆనుకుని వేసిన ప్రత్యేక స్టేజీపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బృందం ఆధ్వర్యంలో కళా బృందాల ఆటాపాట కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. గతానికి భిన్నంగా ఈసారి తెలంగాణ సంస్కృతితో పాటు మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వంటి పథకాలకు సంబంధించిన గేయాలు పాడారు. ‘పల్లె మేలుకోవాలి.. ఇళ్లు మేలుకోవాలి.. ప్రతి మహిళా మేలుకోవాలి’, ‘కొమ్మలల్లా కోయిలమ్మా పాటపాడుతున్నాది.. జై తెలంగాణ అని’, ‘జయజయహే తెలంగాణ’, ‘ఉస్మానియా క్యాంపస్‌లో వీరుల్లారా.. వీరవనితల్లారా..’ అన్న పాటలకు మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు పార్టీ పతాకాలను ఊపుతూ కళాకారులను అభినందించారు. -
ప్రజలే మా బాసులు
* మా మదిలో, గుండెల్లో వాళ్లే * టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం * వారి కల నెరవేర్చేందుకే అహర్నిశలు శ్రమిస్తాం * రాష్ర్ట ప్రజలకే నా జీవితం అంకితం * బంగారు తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తాం * రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు.. ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ * ఐకేపీ సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం * నాలుగేళ్లలో ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి * వాటర్‌గ్రిడ్ పూర్తి కాకుంటే ఓట్లు అడగబోం * మూడేళ్లలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి * వచ్చే నెలలో పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని వెల్లడి * 8వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. - సీఎం కేసీఆర్ ‘టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం’ అని అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ర్ట ప్రజలకే తన జీవితం అంకితమని, బంగారు తెలంగాణ గమ్యం ముద్దాడే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి.. ఆనాటి జల దృశ్యం నుంచి ఈనాటి జన దృశ్యం వరకు అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని కొనియాడారు. ఎనిమిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా వివరించారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. కార్యసాధకులుగా నిలవాలని, బంగారు తెలంగాణ లక్ష్యాన్ని చేరే వరకు పోరాడాలంటూ పార్టీ కార్యకర్తలు, కళాకారుల్లో కొత్త ఉత్తేజం నింపారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... - సాక్షి, హైదరాబాద్ కల నెరవేరుస్తాం అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రాబోయే రెండేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ సోదరులు నిరాశకు గురవుతున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తల తెగిపడ్డా తప్పడు. నిరాశ పడకండి. త్వరలోనే మీ కలలు కూడా నెరవేరుతాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంద శాతం చేస్తాం. ఉద్యోగుల విభజన అయిపోయిన తెల్లారే ఆ ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం. ఐకేపీ, డ్వాక్రా ఉద్యోగులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐకేపీ సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం. కేజీ టు పీజీని వచ్చే ఏడాది అమలు చేస్తాం. ప్రాణహితకు మార్పులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎత్తివేయట్లేదు. మార్పులు చేసుకుంటున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాజెక్టుతో ఆదిలాబాద్ జిల్లాలో 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటాం. దిగువకు అవసరమున్న నీటిని ప్రాణహిత గోదావరిలో కలిశాక.. కాళేశ్వరం నుంచి తీసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మిడ్‌మానేరుకు అక్కణ్నుంచి నీరు తీసుకుంటాం. ఎవడు అడ్డమొస్తడో నేను చూస్తా. ప్రాజెక్టుల కాడ కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానని గతంలో చెప్పిన. రాబోయే నాలుగేళ్లలో ఇటు పాలమూరు.. అటు ప్రాణహిత ప్రాజెక్టులను నిజంగానే కుర్చీ వేసి కట్టించి తీరుతా. ఏడాదిన్నర వ్యవధిలో దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్ఎల్బీసీలను పూర్తి చేస్తాం. హామీ నెరవేర్చకుంటే ఓట్లు అడగం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన పార్టీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రాబోయే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీటిని ఇవ్వకపోతే ఓట్లు అడగమని ఇప్పటికే చెప్పిన. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మనం పట్టుబట్టి తెలంగాణ తెచ్చినట్లుగా అపర భగీరథుల్లా ఈ పథకం చేపట్టాలి. పది జిల్లాల్లో దాదాపు 20 వేల చోట్ల రైల్వే లైన్లు, వాగులు, ఒర్రెలు, కెనాల్స్, హైవేలు, రోడ్లు దాటుతూ పైపులైన్లు వేయాలి. ఎక్కడ ఏం గ్రామంలో ఈ పని వచ్చినా కార్యకర్తలు శివంగి బిడ్డల్లా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ పనుల్లో పాలుపంచుకోవాలి. రోడ్లు, రహదారులకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్లు, బ్రిడ్జి పనులన్నీ కథానాయకులై ముందుకు తీసుకుపోవాలి. మెట్రో రైలు నిర్మాణం అశాస్త్రీయంగా ఉంది. అటు ఎయిర్‌పోర్టు, ఇటు ఇబ్రహీంపట్నం, రాంచంద్రాపురం వరకు పొడిగించాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంస విక్రయ మార్కెట్లు, శ్మశానవాటికలు, డంప్‌యార్డులను అభివృద్ధి చేస్తాం. యాదగిరి నర్సన్న పవర్ ప్లాంట్ ప్రస్తుతం రాష్ర్టంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉంది. అదనంగా రూ. 91,500 కోట్ల నిధులు సమకూర్చుకున్నాం. రాబోయే మూడేళ్లలో 24 వేల మెగావాట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. అసెంబ్లీలో నేనీ విషయం చెబితే.. ‘ఇదేం మాయా మశ్చీంద్రనా.. ఇదేమన్నా అద్భుతమా..’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో మీరు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వాళ్ల కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. నల్లగొండ జిల్లా దామరచర్లలో 6,600 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతాం. ఈ ‘యాదగిరి నర్సన్న’ పవర్ ప్లాంట్‌కు పది రోజుల్లో శంకుస్థాపన చేస్తా. తెలంగాణకు కరెంటు పీడ పోయింది. ఇక కరెంటు కోతలుండవ్. ఇప్పుడు పంటలను ఎండకుండా కాపాడుకున్నాం. గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. పువ్వు పుట్టంగనే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లా పని చేస్తుందో చెప్పడానికి కరెంటు సరఫరానే నిదర్శనం. పరిశ్రమలకు తగినన్ని భూములు, నీళ్లు ఉన్నాయి. కొత్త పారిశ్రామిక విధానం ఉంది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలిరావాలి. ధర్మపురిలో మొక్కు తీరుస్తా తెలంగాణలో గోదావరి ఐదారు వందల కిలోమీటర్లు పారితే.. ఆంధ్రప్రదేశ్‌లో యాభై అరవై కిలోమీటర్లు పారుతుంది. కానీ గోదావరి అంటే రాజమండ్రి.. కృష్ణా పుష్కరమంటే విజయవాడ.. అన్నట్లుగా మారింది. మనం కూడా అక్కడికిపోయి గుండు కొట్టించుకొని స్నానం చేసి వచ్చేటోళ్లం. బాసర సరస్వతి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కాళేశ్వరంలో మహాశివుడు, భద్రాద్రిలో రాముడు కొలువు దీరి ఉన్నాడు. ఒక్క పుణ్యక్షేత్రం లేని రాజమండ్రిలో ఎందుకు పుష్కరాలు పెడుతారని అప్పుడు అసెంబ్లీలో ఆంధ్ర ఎమ్మెల్యేలతో వాదించాను. అప్పుడు తెలంగాణ సమాజం మేలుకున్నది. అప్పటి పుష్కరాల్లో నేను ధర్మపురిలో మునిగిన. మళ్లీ పుష్కరంలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మళ్లీ వస్తానని, ధర్మపురి నర్సన్నకు పాదాభిషేకం, పాలాభిషేకం చేస్తానని, తల్లీ గోదావరీ.. నీ ఒడిలో మునిగి.. నీకు స్వర్ణ కంకణం సమర్పిస్తానని ఆ రోజే మొక్కుకున్నా. అందుకే ఈ పుష్కరాల్లోనూ ధర్మపురికే వెళ్తా. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. సన్నబియ్యం ఆలోచన ఈటలదే గత ప్రభుత్వం రేషన్ బియ్యంపై రూ. 900 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. సీలింగ్ లేకుండా పేద కుటుంబాలకు కడుపు నిండా తిండి పెడుతున్నాం. కాంగ్రెస్ దొరలు దొడ్డ దొరలు. వాళ్లకెప్పుడు హాస్టళ్లలో సదివే పిల్లలకు సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన రాలేదు. ఈటల రాజేందర్, నేను సన్నగనే ఉంటాం. నేను స్వయంగా హాస్టళ్లనే సదువుకున్నా.. పిల్లలకు సన్న బియ్యం పెడుతామని ఈటల చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వమన్నా. కొన్నిసార్లు నాకు అర్థం కాకపోయినా.. నన్ను సముదాయించి ఇలా మంచి పనులు చేయించే బిడ్డలు టీఆర్ఎస్లో ఉన్నారు. సన్న బియ్యం ఘనత ఈటలదే. గోల్కొండ కోటపై జెండా ఎగరేశాం ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగరేస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చారిత్రక వైభవానికి చిహ్నమైన గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరేసినం. గత పాలకులకు ఆ సోయి లేదు. కొమురం భీం విగ్రహం ప్రతిష్ఠించేందుకు వెళితే కాంగ్రెస్ పాలనలో ఆ విగ్రహాలను పోలీస్ స్టేషన్లో పెట్టిన్రు. నేనే స్వయంగా వెళ్లి జోడెఘాట్‌లో కొమురం భీం విగ్రహం పెట్టా. తెలంగాణ గడ్డ గర్వపడే బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పాలకులే గౌరవించలేదు. పీవీని గౌరవించేందుకు అధికారిక ఉత్సవాలు నిర్వహించాం. అన్ని వర్గాలకు అండాదండ! ఇక ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ మరోసారి ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే భరోసా ఇస్తున్నా. ఈ వర్గం, ఆ వర్గం అని లేదు. అందరికీ అండదండగా ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలే అయ్యింది. కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చాం. ముందు ముందు అనేక కార్యక్రమాలు వస్తాయి’ అని స్పష్టంచేశారు. పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. లండన్, అమెరికాలోని పార్టీ శాఖల నిర్వాహకులకూ ధన్యవాదాలు చెప్పారు. ‘కార్మిక వర్గానికి అండగా ఉంటాం. సిర్పూర్ పేపర్ మిల్లును మూత పడనీయం. వరంగల్ జిల్లాలోని ఏపీ రేయాన్స్ మూతపడితే డిప్యూటీ సీఎం కడియం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తీసుకువచ్చి కొన్ని రాయితీలు అడిగారు. వెంటనే ఇచ్చాం. ఏ పరిశ్రమనూ మూతపడనీయం. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు. ఓ గేయం.. ఓ పద్యం.. నూతనోత్తేజం ప్లీనరీలో ప్రసంగం సందర్భంగా కేసీఆర్ ఉత్సాహంగా పాట పాడారు. మరో పద్యంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ‘ఎన్నో కలలు కని తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు నేనే ఒక పాట రాసిన.. మనందరం పాడుకున్నాం’ అంటూ తన ప్రసంగం చివర్లో ఆ గేయంలోని ఓ చరణం అందుకున్నారు. ‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలె.. సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె.. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె’ అని కేసీఆర్ పాటెత్తుకున్నారు. అదే తీరుగా స్వర్ణయుగంవైపు.. బంగారు తెలంగాణ వైపు.. రాష్ట్రం అడుగులు వేస్తుందని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. మరోసారి టీఆర్ఎస్ కార్యకర్తలను కార్యసాధకులుగా కొనియాడుతూ ఓ పద్యాన్ని వల్లెవేశారు. ‘కొందరిని మండలాల్లో బ్రిగేడియర్‌గా వేస్తే కాలినడకన వెళ్లారు. వెనుకటికో కవి రాశారు.. ఒకచో నేలను బవ్వళించు.. నొకచో నొప్పారు బూసెజ్జపై.. నొకచో శాఖములారగించు.. నొకచో నుత్కృష్టశాల్యోదనం.. అంటే కార్యసాధకులు.. నేల మీద పడుకున్నమా.. పరుపు మీద పడుకున్నమా.. అన్నం తిన్నమా.. గంజి తాగినమా.. అని ఆలోచించకుండా ముం దుకుసాగుతరు’ అని కేసీఆర్ ఉత్తేజపరిచారు. ప్రతీ రైతుకు నష్ట పరిహారం ‘పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. మనసు చిన్న చేసుకోకండి. నష్టపోయిన ప్రతీ ఎకరాకు, ప్రతీ రైతుకు సాయం చేస్తాం. కలెక్టర్ల నుంచి నివేదికలు అందగానే సాయమందిస్తాం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు కొన్ని తీర్మానాలు చేశారని, భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయించారని పేర్కొన్నారు. మరికొన్ని విషయాలు 27వ తేదీన జరిగే బహిరంగ సభలో చెప్పుకుందామన్నారు. ఆ సభకు పది లక్షల మంది తరలిరానున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ఎజెండా తెలంగాణ రాష్ట్రమే బలహీనవర్గాల రాష్ట్రం. వారి సంక్షేమానికే పెద్దపీట వేసినం. 34 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. రూ.480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినం. ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించినం. రాష్ట్రంలో 32 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్లు ఇస్తున్నం. 3.75 లక్షల మంది బీడీ కార్మికులు జీవన భృతి పొందుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్ల వేతనాలను పెంచాం. గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, కడుపు నిండా అన్నం, పౌష్టికాహారం అందిస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్‌కు 50 శాతం కోత పెట్టినా రూ.700 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం. రూ.6,500 కోట్ల భారం పడ్డప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయ సోదరులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ముస్లిం మైనారిటీలకు రూ.1033 కోట్లు పెట్టాం. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టులకు రూ.10 కోట్లు కేటాయించామని కేసీఆర్ వివరించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన తీర్మానాలివే.. బంగారు తెలంగాణకు పునరంకితం కావాలని తొలి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేవీ ప్రసాద్ పట్టణాభివృద్ధి, విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంపై రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బి వెంకటేశ్వర్లు తెలంగాణ ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ప్రజాభద్రత, భరోసా ఇచ్చేలా ప్రవేశపెట్టిన పథకాలపై మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోరుతూ నాలుగో తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు వ్యవసాయం, నీటి పారుదల, మిషన్ కాకతీయపై ఐదో తీర్మానం ప్రవేశపెట్టిన హరీష్ రావు తెలంగాణలో విద్యుత్ రంగం, భవిష్యత్ విద్యుత్ ఉత్పాదనపై ఆరో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో మౌలిక వసతుల కల్పనపై ఏడో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పారిశ్రామిక రంగం, తెలంగాణలో తాగునీట వ్యవస్థపై ఎనిమిదో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ వర్తమాన రాజకీయాలు, టీఆర్ఎస్పై తొమ్మిదో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఈటెల్ రాజేందర్ తెలంగాణ హరితహారం, అడవుల అభివృద్ధిపై పదో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ సీతారాం నాయక్ కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలని పదకొండో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ జితేందర్ రెడ్డి -
'కేసీఆర్ మాదిరే.. ఈటెల సన్నగానే ఉంటారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లాగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పాఠశాలల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని అందించలేదని చెప్పారు. తాను హాస్టల్లో ఉండి చదువుకున్నానని, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం భోజనం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని తమ్ముడు ఈటెల రాజేందర్ కోరగా.. తాను ఏమాత్రం ఆలోచించకుండా సన్నబియ్యం మంజూరు చేయాలని ఆదేశించినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు ఉడకని అన్నం, దొడ్డు బియ్యం అన్నం తిన్న హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందించామని ఆయన అన్నారు. సన్నబియ్యం పథకానికి ఛాంపియన్ తమ్ముడు ఈటెల రాజేందరే అని ఆయన అన్నారు. అలాగే ప్రపంచం అబ్బురపడేలా రూ.5 కోట్లతో కొమురం భీం విగ్రహ నిర్మాణం జరుగుతోందన్నారు. అలాగే పీపీ నరసింహారావు జాతి గర్వించదగ్గ నేత అని, ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. యాదగిరి గుట్టను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు. -
ప్రజలే మా బాస్ లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పాలనలో తనకు ప్రజలే 'బాస్'లు అని ప్రశంసించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు. ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు. 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే. తర్వాత లక్షల మంది వచ్చి చేరారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు. ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే. పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం. ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు. ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు. -
నేను ఒక్కడినే బయల్దేరా...
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఒక్కడినే బయల్దేరినా.. మధ్యలో లక్షల మంది వచ్చి చేరారని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్లీనరీలో ఆయన ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్ని ఆరోపణలు, నిందలు వేసినా ఉద్యమ బాటను వీడలేదన్నారు. పోరాటం అంటే ముందుకు పోవటమే అని ఆయన పేర్కొన్నారు. జయాలు, అపజయాలు చూసినా ఎన్నడూ వెనుదిగిరి చూడలేదన్నారు. ఉద్యమంలో అనేకమంది మిత్రులు ఇచ్చిన సహకారం మరవలేనిదని చెప్పారు. ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలే అని, ఓ సందర్భంగా తాను చిన్నబోయి కూర్చుంటే నాయిని నర్సింహారెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహించారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేశామన్నారు. గోల్కొండ కోటపైన తొలిసారి జాతీయ జెండా ఎగురవేశామని ఆయన తెలిపారు. రూ.లక్ష రుణమాఫీ చేసిన ఘటన టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్మూరు ఎర్రజొన్న రైతులకు రూ.11కోట్లు బకాయిలు చెల్లించామన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ నేతలు ఎన్నడూ పేదల గురించి ఆలోచించలేదన్నారు. -
'పోరాటం అంటే ముందుకు పోవటమే'
హైదరాబాద్ : 'కర్తలు మీరే, నిర్ణేతలు మీరే, త్యాగధనులు మీరే, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలే. మీ కష్టంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ మరోసారి అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం అంటే ముందుకు పోవటమే అని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినవారి కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు. ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు. 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే. తర్వాత లక్షల మంది వచ్చి చేరారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు. ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే. తెలంగాణ వాదాన్ని ప్రజలు పట్టించుకునే విధంగా పత్రికల్లో వ్యాసాలు రాశారు. పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం. ఎన్నో పార్టీలు వచ్చి పోయాయి. ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీ కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉంటుంది. పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు. ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు. కుంభమేళను తలపించేలా గోదావరి పుష్కరాలు 34 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ 17వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి పింఛన్లు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా ? పాఠశాలల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టే పథకం. ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు. నేనూ సన్నగానే ఉంటాడు. ఈ పథకం తెచ్చిన ఘనత తెలంగాణ ఆర్థిక మంత్రిదే. ఆ పథకానికి ఛాంపియన్ నా తమ్ముడు ఈటెల రాజేందరే. అంగన్ వాడీ అక్కా చెల్లెళ్లకు జీతాలు పెంచాం. 700 కోట్ల అదనపు భారాన్ని అంగన్ వాడీ వర్కర్ల కోసం కేటాయించాం. అని టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రశంసించారు. -
తెలంగాణ వంటకాల ఘుమఘుమలు
హైదరబాద్: వీణులకు ఇంపైన పాటలు.. కనుల విందైన అలంకరణే కాదు.. నోరూరించే పసందైన వంటకాలకు కూడా ఎల్బీ స్టేడియం నెలవైంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల గులాబీల గుభాళింపే కాకుండా.. ఘుమ్మని వచ్చే తెలంగాణ వంటల ఘాటు వాసనలు గుబాళిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన పార్టీ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ప్లీనరీకి హాజరైనవారికి చక్కని వంటకాలు సిద్ధం చేయిస్తోంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకమైన ఆహార పదార్ధాలనే సిద్ధం చేస్తున్నారు. -
అంతా నావెంటే ఉన్నారు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయన టీఆర్ ఎస్ చేరిక పూర్తయింది. కేసీఆర్‌తో భేటీ అనంతరం మంచిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనవెంటే ఉన్నారన్నారు. కాగా నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనిస్తానని సీఎం హామీ ఇచ్చినందునే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంచిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం, జాపాల్- రంగాపూర్ అబ్జర్వేటరీ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కృష్ణాజలాలతో నింపడం, మూసీ మురుగునీటి శుద్ధికి సీఎం సహకరిస్తానని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల ఒత్తిడి మేరకే టీఆర్ఎస్లో చేరుతున్నా తప్ప ఎలాంటి వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. త్వరలో ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని, దీనికి సీఎం రానున్నారని ఆయన చెప్పారు. -
ప్లీనరీకి ప్రత్యేక పార్కింగ్లు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ వెసులు బాటు కల్పించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ నుంచే వచ్చేవారికోసం ఎన్టీఆర్ స్టేడియం, నల్లగొండ, ఖమ్మం నుంచి వచ్చే వారికోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ వారికోసం నెక్లెస్ రోడ్డు, ఎంఎస్ మక్తా, ఎంఎంటీఎస్, జలవిహార్‌లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల వాహనాలను పార్కింగ్ కోసం పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్లీనరీ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి రాత్రి 7గంటల వరకు నగరంలో ఆంక్షలు ఉండనున్నాయి. ప్లీనరీ కోసం 2,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
గులాబీ కళ
నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. సుమారు 36 వేల మంది కూర్చునేందుకు వీలుగా వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు. నగరమంతా భారీ కటౌట్లు, స్వాగత తోరణాలతో అలంకరించారు. సాక్షి, సిటీబ్యూరో : నగరంలో టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. సమావేశం జరిగే ఎల్బీస్టేడియంలో భారీ వేదిక, సుమారు 36 వేలమంది కూర్చుకునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సమావేశాలను నిరంతరాయంగా వీక్షించేందుకు స్టేడియం లోపల ఆరు భారీ ఎల్ఈడీ తెరలను అమర్చారు. ఎండవేడిమి తగలకుండా 300 భారీ కూలర్లతో ఎయిర్‌కూలింగ్ ఏర్పాట్లు చేశారు. మంచినీరు, అత్యవసర వైద్య సహాయం అందించేందుకు మందులు, అంబులెన్సులు, వైద్యబృందాలను అందుబాటులో ఉంచుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలకు హాజరయ్యేవారికి నిజాం కళాశాల మైందానంలో పసందైన తెలంగాణ వంటకాలు వడ్డించేందుకు ఘనంగా భోజనం ఏర్పాట్లు చేశారు. గురువారం నగర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,తలసాని, పద్మారావు, మహమూద్‌అలీ, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు తదితరులు ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశ్వనగరంపై తీర్మానానికి అవకాశం... ప్లీనరీలో ప్రవేశపెట్టనున్న తీర్మానాల్లో గ్రేటర్ నగరానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మంచినీటి వసతుల కల్పన, బహుళ వరుసల రహదారులు, మల్టిగ్రిడ్ సపరేటర్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, పేదలకు రెండు బెడ్రూమ్ల ఇళ్లు, హరితహారం, సేఫ్కాలనీలు వంటి పథకాలతో మహానగరాన్ని దశలవారీగా ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దనుందో ఈ ప్లీనరీ వేదికపైనుంచి అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. అడుగడుగునా గులాబీ తోరణాలు.. తెలంగాణాలోని పది జిల్లాలతోపాటు గ్రేటర్ నలుమూలల నుంచి ప్లీనరీకి హాజరయ్యే వారికి ఘనస్వాగతం పలికేందుకు అడుగడుగునా స్వాగత తోరణాలు, 150 స్వాగత ద్వారాలు, వివిధ కూడళ్లలో 400 భారీ హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేశారు. గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మందికి తగ్గకుండా ప్లీనరీకి హాజరుకానున్నారు. త్వరలో బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేటర్లుగా పోటీచేయాలనుకుంటున్న ఔత్సాహికులు అధినేత, ముఖ్య నేతల దృష్టిలో పడేందుకు అడుగడుగునా మినీ కటౌట్లు ఏర్పాటు చేయడం విశేషం. ఇక బందోబస్తు ఏర్పాట్లను కమిషనర్ మహేందర్‌రెడ్డి గురువారం పర్యవేక్షించారు. ఎల్బీస్టేడియంలో తనిఖీలు చేపట్టారు. 2500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి పద్మారావు బన్సీలాల్‌పేట్: తెలంగాణ అవతరించిన అనంతరం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ తొలి ప్లీనరీ సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేసినట్లు ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 24న జరిగే ప్లీనరీ, 27న జరిగే బహిరంగ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎల్బీస్టేడియం వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్లీనరీలో పలు తీర్మానాలు ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీలో రోజంతా అక్కడే ఉంటారని చెప్పారు. -
ప్లీనరీకి తరలిరండి
కరీంనగర్ : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ప్లీనరీకి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు సకాలంలో తరలి రావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్లీనరీ విషయమై కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డిలతో గురువారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో చర్చించారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 300 నుంచి 400 మంది ప్రతినిధులు విధిగా హాజరుకావాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ లు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మే యర్లు, మున్సిపల్ చైర్మన్లు, డివిజ న్, మండలా ల బాధ్యులు ప్లీనరీకి తరలిరావాలని కోరారు. -
గులాబీ ధూంధాం
నేడు హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ జాతీయ స్థాయిలో పార్టీల దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు ⇒ పాలన, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారమే ఎజెండా ⇒ ఎల్బీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం ⇒ సాయంత్రం దాకా సుదీర్ఘంగా సమావేశం ⇒ మళ్లీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరు అధికారిక ప్రకటన ⇒ అధ్యక్షోపన్యాసంతో మొదలు కానున్న ప్లీనరీ ⇒ 12 తీర్మానాలు, ఓ సవరణ తీర్మానం సిద్ధం ⇒ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ హైదరాబాద్: పద్నాలుగేళ్ల ప్రయాణం.. పోరాటాలు, ఉద్యమాల ప్రస్థానం.. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిందన్న గౌరవం.. కొత్త రాష్ట్ర తొలి ఎన్నికల్లోనే అధికార పీఠం కైవసం.. వీటన్నింటినీ ప్రతిబింబించేలా, దాదాపు ఏడాది పాలనపై ప్రచారమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్లీనరీని నిర్వహించనుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం... కొద్ది రోజులుగా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. రాష్ట్ర కేబినెట్లోని మెజారిటీ మంత్రుల సేవలను ఈ ప్లీనరీ కోసం వినియోగించుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో యాభై లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన టీఆర్ఎస్... నియోజకవర్గానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించింది. ఇంతకు మరింత ఎక్కువగా యాభైవేల మందికి సరిపడేలా ఏర్పాట్లూ చేసింది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆక ర్షించేలా చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ మొదలు కానుంది. అధికార పార్టీ హోదాలో జరుగుతున్న ఈ ప్లీనరీ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసేలా నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ యంత్రాంగానికి ప్రభుత్వ పాలనపై పూర్తి అవగాహన కల్పించే దిశలోనే తీర్మానాలు ఉండనున్నాయి. కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉంటే క్షేత్ర స్థాయిలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయవచ్చని, తద్వారా ప్రభుత్వ పనితీరును మరింతగా ప్రచారం చేసుకోవడం సులభం అవుతుందని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఉదయం 11.30 గంటలకు పార్టీ ఎన్నికల అధికారి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ను పార్టీ నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ఆ వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణసంచా పేలుస్తారు. ఇదే సమయంలో ప్రతినిధులందరిపైనా గులాబీ పూల వర్షం కురిపించేలా బ్లోయర్లనూ ఏర్పాటు చేయనున్నారు. భారీగా ప్రతినిధులు.. ప్లీనరీకి నియోజకవర్గానికి 300 మంది చొప్పున దాదాపు 36 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరందరినీఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు సమన్వయ పరుస్తారు. సభా ప్రాంగణాన్ని పలు బ్లాకులుగా విభజించారు. రెండు వీఐపీ గ్యాలరీలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక భారీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో 300 కూలర్లను ఏర్పాటు చేయనున్నారు. సభా వేదిక దృశ్యాలను చూసేందుకు వీలుగా ఆరు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తారు. ఇవీ తీర్మానాలు.. ప్లీనరీ కోసం నియమించిన ఏడు కమిటీల్లో తీర్మానాల కమిటీకి పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావును చైర్మన్‌గా నియమించారు. ఆయన నేతృత్వంలోని కమిటీ పన్నెండు తీర్మానాలను, పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఒక సవ రణ తీర్మానాన్ని సిద్ధం చేసింది. అందులో టీఆర్ఎస్ వ్యవస్థాగత నిర్మాణానికి సంబంధించిన తీర్మానం మినహా మిగతా తీర్మానాలన్నీ హామీలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినవే. ప్రతీ సారి జిల్లా పార్టీ కార్యవర్గాలను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా 2వేల మంది సభ్యులు ఉండాల్సి వస్తోందని, అలా కాకుండా ఆ నిబంధనకు సవరణ చేసుకుని పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులే జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకునేలా మార్పులు చేయడానికి సవర ణ తీర్మానం ప్రవేశపెడుతున్నామని పార్టీ నేత ఒకరు చెప్పారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఆ తీర్మానాల వివరాలివి.. ► టీఆర్ఎస్.. వ్యవస్థాగత నిర్మాణం ►పట్టణాభివృద్ధి.. విశ్వనగరంగా హైదరాబాద్ ► తెలంగాణ ప్రజల సంక్షేమం ► తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం ►వ్యవసాయం/ నీటిపారుదల రంగం /మిషన్ కాకతీయ ► రాష్ట్ర విద్యుత్ రంగం ►మౌలిక వసతుల కల్పన ► తాగునీటి వ్యవస్థ ► వర్తమాన రాజకీయాలు .. తెలంగాణ రాష్ట్ర సమితి ► తెలంగాణ హరిత హారం ► రాష్ట్ర విభజన/ కేంద్రం ఇచ్చిన హామీలు ►బలహీన వర్గాల గృహనిర్మాణం.. గోదావరి పుష్కరాలు ఇదీ షెడ్యూల్.. టీఆర్ఎస్ ప్లీనరీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు 11 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రెండు నిమిషాల పాటు తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 11.10కి అడహక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం, 11.20కి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తొలి పలుకులు ఉంటాయి. 11.30కు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ నూతన అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. 11.35కు నూతన అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన ప్రసంగం కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల దాకా భోజన విరామం. ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చ, అధ్యక్షుడి ముగింపు ఉపన్యాసం ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్కింగ్ ప్రదేశాలు ఇవీ.. ⇔ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు: ఎన్టీఆర్ స్టేడియం (అంబేద్కర్ విగ్రహం వద్ద దింపేస్తారు. 1,500 వాహనాలు) ⇔ నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దింపేస్తారు. 1,100 వాహనాలు) ⇔ మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు: నెక్లెస్‌రోడ్, మక్తా, సంజీవయ్య పార్కు (రవీంద్రభారతి వద్ద దింపుతారు. 3,500 వాహనాలు) ⇔ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు: పబ్లిక్ గార్డెన్స్ (ఎల్బీ స్టేడియం డి-గేట్ వద్ద దింపుతారు. 100 వాహనాలు) ⇔ మంత్రులు/ఇతర వీఐపీలు: టెన్నిస్ కోర్టు, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం (ఎల్బీ స్టేడియం డి-గేట్ వద్ద దింపేస్తారు. 50 వాహనాలు) పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ.. ప్లీనరీ అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం రాత్రి పార్టీ ముఖ్యులతో సమావేశమై చర్చించారు. ప్లీనరీలో పన్నెండు తీర్మానాలను, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఒక సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే వీటిల్లో ఏ నేత ఏ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి, ఏం మాట్లాడాలి తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించిన ట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ రాజకీయ కోణాన్ని కార్యకర్తలకు వివరించేలా ప్లీనరీ ఉండాని నాయకులకు సీఎం సూచించినట్లు సమాచారం. నేతలు, ప్రతినిధులు అందరూ ఉదయం 10.30 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని ఆదేశించారు. అదే మాదిరిగా పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలన్న అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని మేలో పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మే 2, 3 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, 4వ తేదీన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లకు శిక్షణ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కే సీఆర్ ఢిల్లీ పర్యటనపైనా చర్చ జరిగిందని తెలిసింది. ప్రసంగంపై ఏకాంతంగా.. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ మొదట అధ్యక్షోపన్యాసం, ముగింపు ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ రెండు సందర్భాల్లో ప్రసంగం ఎలా ఉండాలనే అంశంపై ఆయన కసరత్తు చేసినట్లు తె లిసింది. దీనికోసం కేసీఆర్ తన పాత ఇంటికి వెళ్లి సుమారు రెండున్నర గంటల పాటు ఏకాంతంగా గడిపారని సమాచారం. ఈ సమయంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాత్రమే ఆయన వెంట ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ ఎస్ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధన, పునర్నిర్మాణం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, పార్టీ శ్రేణులకు పదవులు తదితర అంశాలతో కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇదీ షెడ్యూల్.. టీఆర్ఎస్ ప్లీనరీ శుక్రవారం ఉదయం 11కు ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రెండు నిమిషాల పాటు తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 11.10కి అడహక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం, 11.20కి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తొలి పలుకులు ఉంటాయి. 11.30కు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోం మంత్రి నాయిని పార్టీ నూత న అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. 11.35కు నూతన అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన ప్రసంగం కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల దాకా భోజన విరామం. ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చ, అధ్యక్షుడి ముగింపు ఉపన్యా సం ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
నగరం గులాబీమయం
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారుతోంది. ఈ నెల 24న ప్లీనరీ, 27న బహిరంగ సభ ఉండడంతో రాష్ట్ర రాజధానిలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, హోర్డింగులు, సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు. పార్టీ నాయకత్వం ఏర్పాటుచేసిన 7 కమిటీలు ఆయా బాధ్యతల్లో మునిగిపోయాయి. ఇవీ...ఏర్పాట్లు ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియంలో భారీస్టేజీని ఏర్పాటుచేశారు. నియోజకవర్గానికి 300 మంది చొప్పున 36 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు వీరిని సమన్వయపరుస్తారు. ప్రతి ప్రతినిధికి ప్లీనరీ తీర్మానాలతోపాటు, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో కూడిన కిట్లను అందజేయనున్నారు. ప్రతినిధుల సీటింగ్‌కు ఇబ్బంది లేకుండా బ్లాకులుగా విభజించారు. రెండు వీఐపీ గ్యాలరీలు, మహిళల కోసం ఒక భారీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భాగ్యనగరానికి గులాబీ అలంకరణ: ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌ను గులాబీమయం చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అలంకరణ కమిటీ చైర్మన్ కేటీఆర్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియాన్ని భారీ జెండాలు, తోరణాలతో అలంకరించారు. జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం ఎన్టీఆర్ గార్డెన్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. అధ్యక్షుని ప్రకటన జరగ్గానే టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ పేరును ప్లీనరీలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన పేరును ప్రకటించగానే టపాకాయలు పేలుస్తారు. ఇందుకోసం శివకాశి నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించారు. అదే మాదిరిగా ప్రతినిధులు అందరిపైనా గులాబీ పూల వర్షం కురిపించేలా బ్లోయర్లనూ ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాకు లక్ష మంది చొప్పున ఏకంగా పది లక్షల మందిని సమీకరించనున్నట్టు పార్టీ నాయకత్వం చెబుతోంది. -
టీఆర్ఎస్ ప్లీనరీ కోసం.. భారీ ఏర్పాట్లు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపైనా దృష్టి జిల్లాకు లక్ష మంది జన సమీకరణ లక్ష్యం మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతల అప్పగింత హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని విజయవంతంగా ముగించేందుకు అధికార టీఆర్ఎస్ భారీ కసరత్తే చేస్తోంది. అధికార పార్టీ హోదాలో, కొత్త రాష్ట్రంలో తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీ కోసం ఏర్పాట్లనూ అంతే భారీ స్థాయిలో చేస్తోంది. ప్రతీ నియోజకవర్గానికి మూడు వందల మంది చొప్పున ప్రతినిధుల లెక్కన మొత్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీ కోసం ఆహ్వానిస్తున్నారు. ఈనెల 24న ప్లీనరీ, రెండు రోజుల తేడాతో 27న బహిరంగ సభ కూడా ఉండడంతో రాష్ట్ర రాజధానిలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, హోర్డింగులు, సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకుంటూ మంత్రులు అందరికీ ఏర్పాట్ల బాధ్యతలను అప్పజెప్పింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను నిత్యం ఇద్దరు ముగ్గురు మంత్రులు పరిశీలిస్తున్నారు. పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మంగళవారం పరిశీలించారు. ప్లీనరీ విజయవంతం కోసం ఇప్పటికే పార్టీ నాయకత్వం మబొత్తంగా ఏడు కమిటీలను ఏర్పాటు చేయగా, ఏ కమిటికామిటీ తమ పనిలో మునిగిపోయాయి. నియోజకవర్గానికి 300 మంది చొప్పున 36వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరందరినీ ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు సమన్వయ పరుస్తారు. ప్రతీ ప్రతినిధికి ఓ కిట్‌ను అందివ్వనున్నారు. ఈ కిట్లలో ప్లీనరీ తీర్మానాలతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల సమాచారం ఉంటుంది. -
హైదరాబాద్‌ను గులాబీరంగు మయం చేసి...
హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఈ ప్లీనరీ సమావేశాలకు దాదాపు 40 వేల మంది హాజరవుతారని వెల్లడించారు. ఈ ప్లీనరీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌ను గులాబీరంగు మయం చేసి గ్రేటర్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని పద్మారావు స్పష్టం చేశారు. -
'ప్లీనరీకి 36 వేల మంది హాజరవుతారు'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 24న చేపట్టనున్న ప్లీనరీ సమావేశానికి 36 వేల మంది హాజరవుతారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... 24వ తేదీ సాయంత్రం అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ కొత్త అధ్యక్ష ఎన్నికల అధికారిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని చెప్పారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారన్నారు. అలాగే ఈనెల 27న పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు 10 లక్షల మంది హాజరవుతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.