'పోరాటం అంటే ముందుకు పోవటమే'
హైదరాబాద్ : 'కర్తలు మీరే, నిర్ణేతలు మీరే, త్యాగధనులు మీరే, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలే. మీ కష్టంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ మరోసారి అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం అంటే ముందుకు పోవటమే అని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినవారి కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.
- బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు.
- తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు.
- ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు.
- 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే.
- తర్వాత లక్షల మంది వచ్చి చేరారు.
- ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు.
- ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే.
- తెలంగాణ వాదాన్ని ప్రజలు పట్టించుకునే విధంగా పత్రికల్లో వ్యాసాలు రాశారు.
- పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం.
- ఎన్నో పార్టీలు వచ్చి పోయాయి.
- ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం.
- ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీ కొనసాగుతూనే ఉంది.
- టీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉంటుంది.
- పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు.
- ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు.
- కుంభమేళను తలపించేలా గోదావరి పుష్కరాలు
- 34 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ
- 17వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నాం
- కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు
- బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి పింఛన్లు
- తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోంది.
- కాంగ్రెస్ నేతలు ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా ?
- పాఠశాలల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టే పథకం.
- ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు.
- నేనూ సన్నగానే ఉంటాడు.
- ఈ పథకం తెచ్చిన ఘనత తెలంగాణ ఆర్థిక మంత్రిదే.
- ఆ పథకానికి ఛాంపియన్ నా తమ్ముడు ఈటెల రాజేందరే.
- అంగన్ వాడీ అక్కా చెల్లెళ్లకు జీతాలు పెంచాం.
- 700 కోట్ల అదనపు భారాన్ని అంగన్ వాడీ వర్కర్ల కోసం కేటాయించాం.
అని టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రశంసించారు.