ప్రజలే మా బాస్ లు: కేసీఆర్ | kcr speech in TRS pleanery | Sakshi
Sakshi News home page

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్

Published Fri, Apr 24 2015 1:24 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్ - Sakshi

ప్రజలే మా బాస్ లు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పాలనలో తనకు ప్రజలే 'బాస్'లు అని ప్రశంసించారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు.
  • బంగారు తెలంగాణ కోసం పాటుపడ్డారు.
  • తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో బాధలు పడ్డారు.
  • ఈ కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు.
  • 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే.
  • తర్వాత లక్షల మంది వచ్చి చేరారు.
  • ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు.
  • ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే.
  • పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం.
  • ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం.
  • ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు.
  • పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు.
  • ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement