గులాబీ ధూంధాం | Today TRS plenary in Hyderabad | Sakshi
Sakshi News home page

గులాబీ ధూంధాం

Published Fri, Apr 24 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

గులాబీ ధూంధాం

గులాబీ ధూంధాం

నేడు హైదరాబాద్‌లో  టీఆర్‌ఎస్ ప్లీనరీ
జాతీయ స్థాయిలో పార్టీల దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు

 
 
పాలన, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారమే ఎజెండా
ఎల్బీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం
సాయంత్రం దాకా సుదీర్ఘంగా సమావేశం
మళ్లీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరు అధికారిక ప్రకటన
అధ్యక్షోపన్యాసంతో మొదలు కానున్న ప్లీనరీ
12 తీర్మానాలు, ఓ సవరణ తీర్మానం సిద్ధం
అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ

 
 హైదరాబాద్: పద్నాలుగేళ్ల ప్రయాణం.. పోరాటాలు, ఉద్యమాల ప్రస్థానం.. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిందన్న గౌరవం.. కొత్త రాష్ట్ర తొలి ఎన్నికల్లోనే అధికార పీఠం కైవసం.. వీటన్నింటినీ ప్రతిబింబించేలా, దాదాపు ఏడాది పాలనపై ప్రచారమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్లీనరీని నిర్వహించనుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం... కొద్ది రోజులుగా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. రాష్ట్ర కేబినెట్‌లోని మెజారిటీ మంత్రుల సేవలను ఈ ప్లీనరీ కోసం వినియోగించుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో యాభై లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన టీఆర్‌ఎస్... నియోజకవర్గానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించింది. ఇంతకు మరింత ఎక్కువగా యాభైవేల మందికి సరిపడేలా ఏర్పాట్లూ చేసింది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆక ర్షించేలా చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్ ప్లీనరీ మొదలు కానుంది. అధికార పార్టీ హోదాలో జరుగుతున్న ఈ ప్లీనరీ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసేలా నిర్వహించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. పార్టీ యంత్రాంగానికి ప్రభుత్వ పాలనపై పూర్తి అవగాహన కల్పించే దిశలోనే తీర్మానాలు ఉండనున్నాయి. కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉంటే క్షేత్ర స్థాయిలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయవచ్చని, తద్వారా ప్రభుత్వ పనితీరును మరింతగా ప్రచారం చేసుకోవడం సులభం అవుతుందని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఉదయం 11.30 గంటలకు పార్టీ ఎన్నికల అధికారి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ను పార్టీ నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ఆ వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణసంచా పేలుస్తారు. ఇదే సమయంలో ప్రతినిధులందరిపైనా గులాబీ పూల వర్షం కురిపించేలా బ్లోయర్లనూ ఏర్పాటు చేయనున్నారు.

భారీగా ప్రతినిధులు..

ప్లీనరీకి నియోజకవర్గానికి 300 మంది చొప్పున దాదాపు 36 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరందరినీఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులు సమన్వయ పరుస్తారు. సభా ప్రాంగణాన్ని పలు బ్లాకులుగా విభజించారు. రెండు వీఐపీ గ్యాలరీలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక భారీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో 300 కూలర్లను ఏర్పాటు చేయనున్నారు. సభా వేదిక దృశ్యాలను చూసేందుకు వీలుగా ఆరు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తారు.

ఇవీ తీర్మానాలు..

ప్లీనరీ కోసం నియమించిన ఏడు కమిటీల్లో తీర్మానాల కమిటీకి పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావును చైర్మన్‌గా నియమించారు. ఆయన నేతృత్వంలోని కమిటీ  పన్నెండు తీర్మానాలను, పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఒక సవ రణ తీర్మానాన్ని సిద్ధం చేసింది. అందులో టీఆర్‌ఎస్ వ్యవస్థాగత నిర్మాణానికి సంబంధించిన తీర్మానం మినహా మిగతా తీర్మానాలన్నీ హామీలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినవే. ప్రతీ సారి జిల్లా పార్టీ కార్యవర్గాలను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా 2వేల మంది సభ్యులు ఉండాల్సి వస్తోందని, అలా కాకుండా ఆ నిబంధనకు సవరణ చేసుకుని పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులే జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకునేలా మార్పులు చేయడానికి సవర ణ తీర్మానం ప్రవేశపెడుతున్నామని పార్టీ నేత ఒకరు చెప్పారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఆ తీర్మానాల వివరాలివి..

టీఆర్‌ఎస్.. వ్యవస్థాగత నిర్మాణం
పట్టణాభివృద్ధి.. విశ్వనగరంగా హైదరాబాద్
తెలంగాణ ప్రజల సంక్షేమం
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
వ్యవసాయం/ నీటిపారుదల రంగం /మిషన్ కాకతీయ
రాష్ట్ర విద్యుత్ రంగం
మౌలిక వసతుల కల్పన
తాగునీటి వ్యవస్థ
వర్తమాన రాజకీయాలు .. తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణ హరిత హారం
రాష్ట్ర విభజన/ కేంద్రం ఇచ్చిన హామీలు
బలహీన వర్గాల గృహనిర్మాణం.. గోదావరి పుష్కరాలు
 
ఇదీ షెడ్యూల్..
 
టీఆర్‌ఎస్ ప్లీనరీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు 11 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రెండు నిమిషాల పాటు తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 11.10కి అడహక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం, 11.20కి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తొలి పలుకులు ఉంటాయి. 11.30కు టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్టీ నూతన అధ్యక్షుడిగా కె.చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. 11.35కు నూతన అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన ప్రసంగం కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల దాకా భోజన విరామం. ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చ, అధ్యక్షుడి ముగింపు ఉపన్యాసం ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
 
పార్కింగ్ ప్రదేశాలు ఇవీ..

ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు: ఎన్టీఆర్ స్టేడియం (అంబేద్కర్ విగ్రహం వద్ద దింపేస్తారు. 1,500 వాహనాలు)
 
నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దింపేస్తారు. 1,100 వాహనాలు)
 
మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు: నెక్లెస్‌రోడ్, మక్తా, సంజీవయ్య పార్కు (రవీంద్రభారతి వద్ద దింపుతారు. 3,500 వాహనాలు)
 
⇔  ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు: పబ్లిక్ గార్డెన్స్ (ఎల్‌బీ స్టేడియం డి-గేట్ వద్ద దింపుతారు. 100 వాహనాలు)

⇔  మంత్రులు/ఇతర వీఐపీలు: టెన్నిస్ కోర్టు, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం (ఎల్‌బీ స్టేడియం డి-గేట్ వద్ద దింపేస్తారు. 50 వాహనాలు)
 
పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ..
 
ప్లీనరీ అంశాలపై సీఎం కేసీఆర్ గురువారం రాత్రి పార్టీ ముఖ్యులతో సమావేశమై చర్చించారు. ప్లీనరీలో పన్నెండు తీర్మానాలను, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఒక సవరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే వీటిల్లో ఏ నేత ఏ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి, ఏం మాట్లాడాలి తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించిన ట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ రాజకీయ కోణాన్ని కార్యకర్తలకు వివరించేలా ప్లీనరీ ఉండాని నాయకులకు సీఎం సూచించినట్లు సమాచారం. నేతలు, ప్రతినిధులు అందరూ ఉదయం 10.30 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని ఆదేశించారు. అదే మాదిరిగా పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలన్న అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని మేలో పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మే 2, 3 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, 4వ తేదీన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లకు శిక్షణ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కే సీఆర్ ఢిల్లీ పర్యటనపైనా చర్చ జరిగిందని తెలిసింది.
 
 ప్రసంగంపై ఏకాంతంగా..

ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ మొదట అధ్యక్షోపన్యాసం, ముగింపు ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ రెండు సందర్భాల్లో ప్రసంగం ఎలా ఉండాలనే అంశంపై ఆయన కసరత్తు చేసినట్లు తె లిసింది. దీనికోసం కేసీఆర్ తన పాత ఇంటికి వెళ్లి సుమారు రెండున్నర గంటల పాటు ఏకాంతంగా గడిపారని సమాచారం. ఈ సమయంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాత్రమే ఆయన వెంట ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ ఎస్ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధన, పునర్నిర్మాణం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, పార్టీ శ్రేణులకు పదవులు తదితర అంశాలతో కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం ఉందంటున్నారు.
 
ఇదీ షెడ్యూల్..


టీఆర్‌ఎస్ ప్లీనరీ శుక్రవారం ఉదయం 11కు ప్రారంభం కానుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రెండు నిమిషాల పాటు తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. 11.10కి అడహక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం, 11.20కి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తొలి పలుకులు ఉంటాయి. 11.30కు టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోం మంత్రి నాయిని పార్టీ నూత న అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. 11.35కు నూతన అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన ప్రసంగం కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల దాకా భోజన విరామం. ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చ, అధ్యక్షుడి ముగింపు ఉపన్యా సం ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement