టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు | 12 resolutions in TRS plenary | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు

Published Fri, Apr 24 2015 4:34 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు

టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు

హైదరాబాద్:  హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్ ప్లీనరీలో 12 తీర్మానాలు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన తీర్మానాలివే..
 

  • బంగారు తెలంగాణకు పునరంకితం కావాలని తొలి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేవీ ప్రసాద్
  • పట్టణాభివృద్ధి, విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడంపై రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బి వెంకటేశ్వర్లు
  • తెలంగాణ ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ప్రజాభద్రత, భరోసా ఇచ్చేలా ప్రవేశపెట్టిన పథకాలపై మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  • తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోరుతూ నాలుగో తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు
  • వ్యవసాయం, నీటి పారుదల, మిషన్ కాకతీయపై ఐదో తీర్మానం ప్రవేశపెట్టిన హరీష్ రావు
  • తెలంగాణలో విద్యుత్ రంగం, భవిష్యత్ విద్యుత్ ఉత్పాదనపై ఆరో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి జగదీశ్ రెడ్డి
  • తెలంగాణలో మౌలిక వసతుల కల్పనపై ఏడో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • పారిశ్రామిక రంగం, తెలంగాణలో తాగునీట వ్యవస్థపై ఎనిమిదో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
  • వర్తమాన రాజకీయాలు, టీఆర్ఎస్పై తొమ్మిదో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఈటెల్ రాజేందర్
  • తెలంగాణ హరితహారం, అడవుల అభివృద్ధిపై పదో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ సీతారాం నాయక్
  • కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలని పదకొండో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ జితేందర్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement