ప్లీనరీకి ప్రత్యేక పార్కింగ్లు | diferent parking places for trs plenary | Sakshi
Sakshi News home page

ప్లీనరీకి ప్రత్యేక పార్కింగ్లు

Published Fri, Apr 24 2015 7:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

diferent parking places for trs plenary

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్ వెసులు బాటు కల్పించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ నుంచే వచ్చేవారికోసం ఎన్టీఆర్ స్టేడియం, నల్లగొండ, ఖమ్మం నుంచి వచ్చే వారికోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ వారికోసం నెక్లెస్ రోడ్డు, ఎంఎస్ మక్తా, ఎంఎంటీఎస్, జలవిహార్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల వాహనాలను పార్కింగ్ కోసం పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్లీనరీ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలనుంచి రాత్రి 7గంటల వరకు నగరంలో ఆంక్షలు ఉండనున్నాయి. ప్లీనరీ కోసం 2,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement