
తెలంగాణ వంటకాల ఘుమఘుమలు
హైదరబాద్: వీణులకు ఇంపైన పాటలు.. కనుల విందైన అలంకరణే కాదు.. నోరూరించే పసందైన వంటకాలకు కూడా ఎల్బీ స్టేడియం నెలవైంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల గులాబీల గుభాళింపే కాకుండా.. ఘుమ్మని వచ్చే తెలంగాణ వంటల ఘాటు వాసనలు గుబాళిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏర్పాటు చేసిన పార్టీ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి చాలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే ప్లీనరీకి హాజరైనవారికి చక్కని వంటకాలు సిద్ధం చేయిస్తోంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకమైన ఆహార పదార్ధాలనే సిద్ధం చేస్తున్నారు.