రాష్ట్రంలో 4,442 మంది సహాయ వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం అధికారులను ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4,442 మంది సహాయ వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. గ్రామాల్లో వ్యవసాయదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి.. సకాలంలో వారికి అందుబాటులో ఉండటానికి విస్తరణాధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉద్యానవనం, వ్యవసాయంలో డిప్లొమా చేసిన నిరుద్యోగ యువకులకు దీనివల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆదర్శ రైతు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా విస్తరణాధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు మొత్తం 16,841 మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.