వరంగల్: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, మినీ బస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడినవారిని 108 వాహనంలో జనగామ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని కొందరు అంటుంటే, దట్టంగా అలముకున్న మంచు అని మరికొందరు అంటున్నారు.
టాటా ఏసీ-మినీ బస్ ఢీకొని నలుగురి మృతి
Published Sun, Jan 18 2015 9:07 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement