స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి | 4 years old child died due to school bus accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

Published Tue, Dec 8 2015 11:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

4 years old child died due to school bus accident

దమ్ముగూడ: స్కూలు బస్సు చక్రాల కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా  మండవల్లి మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... స్ధానిక మణుగూరు సాంబయ్య గూడకు చెందిన గంగాభవానీ(4) దమ్ముగూడలోని అమ్మమ్మ దగ్గర ఉంటోంది.
 
ఈ రోజు ఉదయం చిన్నారి అమ్మమ్మ తన కొడుకు పిల్లలను స్కూలు బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. అమ్మమ్మతో పాటు వెళ్లిన గంగాభవానీ ఆడుకుంటూ బస్సు వెనుక చక్రాల కింద పడింది. అది గమనించని డ్రైవర్ బస్సు ముందుగా పోనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement