500 డిజైన్లలో బతుకమ్మ చీరలు...!
రేషన్ కార్డుల ఆధారంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఒక్కో కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళల వివరాలను ప్రభుత్వం సేకరించింది. బతుకమ్మ పండుగ ఈ నెల మూడో వారంలో వస్తున్న నేపథ్యంలో చీరల పంపిణీ క్షేత్ర స్థాయిలో 18,19 తేదీల్లో పూర్తి చేయాలని, ఇంకా మిగిలిన వారుంటే 20వ తేదీన కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.