సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఖాళీగా ఉన్న 513 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీలో భాగంగా పీజీటీ మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ ఆదివారం ప్రకటించింది. 126 పీజీటీ మ్యాథమెటిక్స్ పోస్టులకుగాను 114 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా మిగతా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల మెడికల్ రిపోర్టులు అందాక ఫలితాలు ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
అలాగే 22 బయోలాజికల్ సైన్స్ పోస్టులకుగాను 21 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 177 పీజీటీ సోషల్ స్టడీస్ పోస్టుల్లో 166 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా పోస్టుల్లో వికలాంగులకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు వచ్చాక ఫలితాలు ప్రకటించనుంది. 188 ఫిజికల్ సైన్స్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా 174 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇటీవల పీజీటీ లాంగ్వేజెస్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులతోపాటు తాజా ఎంపిక జాబితాను కలుపుకొని మొత్తం గా 921 పోస్టుల పలితాలను ప్రకటించింది.
ఫారెస్టు కాలేజీ పోస్టుల ఫలితాలు విడుదల
ఫారెస్టు కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 19 పోస్టులకుగాను (2 ప్రొఫెసర్ పోస్టులకు ఒకే దరఖాస్తు రాగా, 4 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులే రాలేదు) 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా 11 పోస్టులకే దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో వాటిలో 7 పోస్టులే భర్తీ అయ్యాయి. లైబ్రేరియన్ పోస్టుకు జనవరి 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment