నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్‌టైల్స్ పార్క్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్‌టైల్స్ పార్క్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. వివరాలు... టెక్స్‌టైల్స్ పార్క్‌లో కార్మికులకు శిక్షణ ఇచ్చే కేంద్రంలో 55 కుట్టు మిషన్లు ఉన్నాయి. సోమవారం రాత్రి శిక్షణ కేంద్రం వెనకభాగంలోని కిటికీని తొలగించి లోపలికి వెళ్లి అందులో ఉన్న 55 కుట్టుమిషన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారి తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.