ప్రైవేటు ఆస్పత్రులకు కల్తీకల్లు బాధితులు | 65 sick after consuming adulterated toddy | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రులకు కల్తీకల్లు బాధితులు

Published Mon, Sep 14 2015 5:01 PM | Last Updated on Fri, Aug 17 2018 5:07 PM

65 sick after consuming adulterated toddy

నిజామాబాద్ : మెదక్ జిల్లాకు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కల్తీ కల్లు బాధితులను చికిత్స నిమిత్తం రామాయంపేటలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇసన్నపల్లి గ్రామంలో వందలాది మంది కల్తీ కల్లుతో అస్వస్థతకు గురి కాగా వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి, రామాయంపేట, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఇసన్నపల్లికి రామాయంపేట 5 కిలోమీటర్ల లోపు ఉండటంతో రోగులను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈమేరకు గత నాలుగు రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 మంది వరకు చికిత్సలు పొందారు. సోమవారం ఐదుగురిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు వింత చేష్టలతో ప్రవర్తిస్తుండగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement