ఈత సరదా వాళ్ల ప్రాణాలు తీసింది | 6Students Washed away in karimnagar maneru dam, five bodies found | Sakshi
Sakshi News home page

ఈత సరదా వాళ్ల ప్రాణాలు తీసింది

Published Mon, May 25 2015 12:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

ఈత సరదా వాళ్ల ప్రాణాలు తీసింది - Sakshi

ఈత సరదా వాళ్ల ప్రాణాలు తీసింది

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పద్మానగర్ వద్ద మానేరు డ్యాంలో మునిగి ఆరుగురు చిన్నారు మృత్యువాత పడ్డారు. వివరాలు.. సాయిసృజన్ రెడ్డి(13), గోపి(12), ప్రద్యుమ్న(10), సుహిత్(13), సుమిత్(13), శివసాయి(14), యాచమేని ప్రతీశ్(13)అనే ఆరుగురు చిన్నారులు సోమవారం ఉదయాన్నే క్రికెట్ ఆడటానికి వెళ్లి అనంతరం స్నానం చేయడానికి పక్కనే ఉన్న మానేరు డ్యాంలోకి దిగారు. ప్రమాదవశాత్తూ ఒకరి వెంట మరొకరు మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమిత్, సుహిత్ కవలలు.

 

చిన్నారులు చనిపోవటంతో ఆ ప్రాంతమంతా హృదయ విధారక వాతావరణం నెలకొంది. చనిపోయిన వారి మృతదేహాలన్నింటినీ వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వీరంతా వేసవి సెలవుల కావటంతో హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు వచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement