నాగార్జున సాగర్ (నల్లగొండ) : సీపీఎం ప్లీనరీకి వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కారులో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆదివారం నుంచి సీపీఎం ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. వాటిలో పాల్గొనడానికి కారులో బయలుదేరిన సీపీఎం కార్యకర్తలు కొండమల్లెపల్లి చెన్నారం గేట్ వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.