car overturns
-
కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ఆరుగురి దుర్మరణం
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ వద్ద పొలాచ్చిలోని పరంబికులమ్-అలియార్ ప్రాజెక్టు కాలువలో తాము ప్రయాణిస్తున్న కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బాధితుల మృతదేహాలను పొలాచ్చి జనరల్ ఆస్పత్రిలో ఉంచారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. -
ప్రాణాలు నిలబెట్టిన సీటుబెల్ట్
పెనుకొండ రూరల్: సీటుబెల్టు ధరించడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అనంతపురం నుంచి బెంగళూరు వైపు 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కారు పెనుకొండ మండలం గోనిపేట వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పింది. పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయ్యి రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరులోని హెబ్బాల్‌కు చెందిన రెస్టారెంట్ నిర్వాహకులు అవినాష్.జె, అవినాష్.బి, ఆదిత్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల వీరికి ప్రాణాపాయం తప్పిందని పెనుకొండ ఎస్ఐ జనార్ధన్ తెలిపారు. -
కారు బోల్తా: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ సిటీ: హయత్‌నగర్ మండలం ఈనమగూడ వద్ద 66వ నెంబర్ జాతీయరహదారిపై మారుతీ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా చిట్యాలకు వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీ పనులకు వెళ్తూ..
కానరాని లోకాలకు కారు అదుపు తప్పి భర్త మృతి ప్రాణాలతో బయటపడిన భార్యా పిల్లలు కోవూరు : విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎదుగుతూ పది మందికి సహాయ పడుతుండటం చూసి సహించలేకపోయింది. ఎన్నో కష్టాలు పడి కుదురుకుంటున్న కుటుంబ యజమానిని రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ దురదృష్ట సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై భారత్‌బెంజ్ షోరూం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని సూదరగుంట రామాపురానికి చెందిన ఎద్దు ఏడుకొండలు (34) బెంగళూరులో కూలీలను తీసుకుని వెళ్లి బేల్దారి పనులు చేయించేవాడు. ఇటీవల రామాపురంలో జరిగిన ఓ వివాహానికి ఏడుకొండలు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చాడు. శనివారం రాత్రి ఏడుకొండలు భార్య అంకమ్మ, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో పాటు తండ్రి చెన్నయ్య, సమీప బంధువు చలమయ్యతో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. పడుగుపాడు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగిలిన వారికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అళహరి వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరిని బతికించేందుకు.. కారు నడుపుతున్న ఏడుకొండలు ప్రమాదంలో అందరిని బతికించేందుకు తాను ప్రాణాలను పణంగా పెట్టాడు. కారు అదుపు తప్పిన సమయంలో ఏడుకొండలు బయటకు దూకేసి ఉంటే కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాపడేది. దీంతో పెనుప్రమాదం జరిగేది. అయితే ఏడుకొండలు అప్రమత్తమై కారు కంట్రోల్ చేస్తూ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఇనుపు కంచెను ఢీకొన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బోల్తా పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. మమ్మల్ని బతికించి నువ్వు దూరమయ్యావా... మమ్మల్ని బతికించేందుకు నీవు దూరమయ్యావా అంటూ ఏడుకొండలు భార్య అంకమ్మ రోదిస్తూ విలపిస్తుంది. ఇద్దరు బిడ్డలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న తీరను చూసిన స్థానికులను కలిచివేసింది. ఏడుకొండలకు భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
కారు బోల్తా: మహిళ మృతి
పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పులివెందులలోని నామాలగుండు వద్ద ఓ కారు బోల్తా పడి జయకళ(38) అనే ఉపాధ్యాయురాలు మృతిచెందారు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. గొల్లపల్లి తాండాలో పనిచేస్తున్న ఆమె అటుగా వస్తున్న కారులో లిఫ్ట్ అడిగి ఎక్కారు. అయితే పులివెందుల శివారులో కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా: ఏడుగురికి గాయాలు
నాగార్జున సాగర్ (నల్లగొండ) : సీపీఎం ప్లీనరీకి వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కారులో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆదివారం నుంచి సీపీఎం ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. వాటిలో పాల్గొనడానికి కారులో బయలుదేరిన సీపీఎం కార్యకర్తలు కొండమల్లెపల్లి చెన్నారం గేట్ వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా : యువకుడు మృతి
రంగారెడ్డి (మొయినాబాద్) : మొయినాబాద్ మండలం కనకమామిడి గేటు సమీపంలో శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన సాయి(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఫిరంగిపురం (గుంటూరు) : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు-తాళ్లూరు మధ్య వద్ద శనివారం సాయంత్రం జరిగింది. అమరావతి నుంచి ఫిరంగిపురం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఖాసింబీ అనే మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమె చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వీరంతా బక్రీద్ సందర్భంగా సొంత గ్రామం అయిన ఫిరంగిపురంకి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి చూసేందుకు వెళ్లారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు కాల్వలో బోల్తాపడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. కారులోకి నీరు ప్రవేశించటంతో అందులోని వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా
ఘట్కేసర్ టౌన్ (హైదరాబాద్) : ఔటర్ రింగ్‌రోడ్డుపై ఫార్చ్యూనర్ కారు బోల్తా పడడంతో ఓ టీడీపీ నాయకుడు మృతి చెందగా, మరో ఇద్దరు టీడీపీ నాయకులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ యాతకుమార్, ఘట్కేసర్ మండల టీడీపీ కార్యదర్శి మీసాల కృష్ణలు కారులో హైదరాబాద్ నుంచి ఘట్కేసర్ వైపు వెళుతుండగా మంగళవారం సాయంత్రం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికీ గాయాలు కాగా కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ యాతకుమార్ మృతి చెందారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఎస్సైలకు గాయాలు
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఎస్సైలకు గాయాలు
గద్వాల్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ వలయాన్ని ఢీ కొనడంతో ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలం అనంతపురం గ్రామం సమీపంలోని దెయ్యాలవాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల్ టౌన్ ఎస్సై సైదాబాయి, మల్డకల్ ఎస్సై శ్రీనివాసులు, అయిజ ఎస్సై వెంకటేశ్వర్లు ఒక కేసు నిమిత్తం కారులో కర్నూలు వెళ్లి వస్తున్నారు. కాగా మార్గ మధ్యంలో వర్షం వస్తుండటంతో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి దెయ్యాల వాగు వద్ద ఉన్న రక్షణ గోడకు ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. వీరిలో మల్డకల్ ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
కారు బోల్తా : 15 మందికి గాయాలు
-
కారు బోల్తా : నిలిచిన ట్రాఫిక్
మంగంపేట(వరంగల్ జిల్లా): పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డుపై కారు బోల్తాపడటంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం వరంగల్ జిల్లా మంగంపేట మండలం కమలాపూర్ గ్రామం సమీపంలో ఒక కారు బోల్తాపడింది. కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించడంలో ఆలస్యం జరిగింది. దీంతో ఏటూరునాగారం నుంచి మంగంపేట పుష్కరఘాట్ వరకు 15కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పుష్కరాలకు వెళ్లే భక్తులు గంట కొద్ది తమ వాహనాల్లోనే గడపాల్పిన పరిస్థితి ఏర్పడింది.