
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ వద్ద పొలాచ్చిలోని పరంబికులమ్-అలియార్ ప్రాజెక్టు కాలువలో తాము ప్రయాణిస్తున్న కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బాధితుల మృతదేహాలను పొలాచ్చి జనరల్ ఆస్పత్రిలో ఉంచారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment