పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డుపై కారు బోల్తాపడటంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మంగంపేట(వరంగల్ జిల్లా): పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డుపై కారు బోల్తాపడటంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం వరంగల్ జిల్లా మంగంపేట మండలం కమలాపూర్ గ్రామం సమీపంలో ఒక కారు బోల్తాపడింది.
కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించడంలో ఆలస్యం జరిగింది. దీంతో ఏటూరునాగారం నుంచి మంగంపేట పుష్కరఘాట్ వరకు 15కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పుష్కరాలకు వెళ్లే భక్తులు గంట కొద్ది తమ వాహనాల్లోనే గడపాల్పిన పరిస్థితి ఏర్పడింది.