ట్రాఫిక్ లో చిక్కుకున్న మాజీ డిప్యూటీ సీఎం | heavy traffic jam at warangal highway | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ లో చిక్కుకున్న మాజీ డిప్యూటీ సీఎం

Published Sat, Sep 17 2016 1:01 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

ట్రాఫిక్ లో చిక్కుకున్న మాజీ డిప్యూటీ సీఎం

ట్రాఫిక్ లో చిక్కుకున్న మాజీ డిప్యూటీ సీఎం

యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మోటకొండూరు మండలంలో కలపొద్దని కోరుతూ.. గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతుండటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గ్రామానికి చెందిన విద్యార్థులు, రైతులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై కూర్చొని ఆందోళన నిర్వహిస్తున్నారు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులను అక్కడి నుంచి తప్పుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో  తమ లాఠీలకు పనిచెప్పారు. భారీ ట్రాఫిక్ జాం వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి, వరంగల్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాహనం కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసుందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement