రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ కొరత
తెలంగాణలో రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ కొరత ఉన్నట్లు గుర్తించారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై ఆ శాఖలకు చెందిన వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరతను అధిగమించేందుకు నాలుగు నుంచి ఐదు మిలియన్ల యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కేరళ నుంచి విద్యుత్ను కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం పరిశ్రమలు ఇబ్బంది పడకుండా విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిపై కూడా కేసీఆర్ ఆరాతీసినట్లు తెలిసింది.