
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీల్లో 863 ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐ–ఆర్‌బీ) ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఈఐ–ఆర్‌బీ కార్యనిర్వాహక అధికారిని ఆదేశించారు. జోన్, జిల్లా అంశాలతోపాటు రోస్టర్ పాయింట్లు, అర్హతలను నిర్ణయించి పోస్టులను భర్తీ చేయాలని సూచించారు..
పోస్టుల వివరాలు: ప్రిన్సిపాల్ 15, లెక్చరర్ 616, లైబ్రేరియన్ 15, ఫిజికల్ డైరెక్టర్ 15, మెస్ మేనేజర్/వార్డెన్ 15, స్టాఫ్‌నర్సు 31, కేర్ టేకర్ 15, ల్యాబ్ అసిస్టెంట్ 62, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 22, జూనియర్ అసిస్టెంట్ 11, స్టోర్ కీపర్ 15.
Comments
Please login to add a commentAdd a comment