
జగిత్యాల: స్వచ్ఛభారత్‌లో జగిత్యాల జిల్లా అగ్రగామిగా నిలిచింది. కేంద్రం నంబర్‌వన్ ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కలెక్టర్ శరత్, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయ పరిచి ఓడీఎఫ్ సాధించేందుకు కృషి చేశారు. జిల్లాలో 330 గ్రామ పంచాయతీలు, 485 హాబిటేషన్స్ కలిగి ఉన్నాయి. గ్రామాల్లో 36 గంటల్లోనే 920 మరుగుదొడ్లు కట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
కేంద్రం స్వచ్ఛదర్పన్ పథకం కింద దేశంలో 7 రాష్ట్రాలకు స్థానం కల్పించగా.. ఇందులో జగిత్యాల, సిరిసిల్ల జిల్లా మొదటి ర్యాంకులు పొందాయి. జగిత్యాల జిల్లా కు కేంద్రం పెర్ఫార్‌మెన్స్‌పై మొదటి కేట గిరీలో 50 మార్కులు, అవగాహనపై రెండో కేటగిరీలో 15 మార్కులు, పారదర్శ కత్వం కింద టాయిలెట్స్‌ను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసే మూడో కేటగిరీలో 25 మార్కులు కేటాయించింది.