కల్తీకల్లు దొరక్క ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ధారూరు మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ధారూర్‌కు చెందిన బుడజంగం దస్తయ్య(35) అనే వ్యక్తి కల్తీ కల్లుకు బానిసయ్యాడు. అధికారుల దాడులు ముమ్మరంగా ఉండటంతో.. మూడు రోజులుగా కల్తీ కల్లు దొరకడం లేదు.. దీంతో దస్తయ్య మూడు రోజులుగా వింత వింతగా ప్రవర్తిస్తుండటంతో.. కుటుంబీకులు దస్తయ్యను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అతడు బుధవారం మరణించారు. కల్తీకల్లు తాగకపోవడం వల్లే దస్తయ్య మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు.
కల్తీ కల్లు దొరక్క వ్యక్తి మృతి
Published Wed, Nov 18 2015 9:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement