
విచారణ పేరుతో చితక బాదారు
రంగారెడ్డి(మంచాల): విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఓ వ్యక్తిని పోలీసులు చితక బాదారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడిని పోలీసులు కేసు దర్యాప్తులో స్టేషన్‌కు పిలిపించారు. తర్వాత ఏమైందో ఏమో వీపుపై చితక బాదారు. దీంతో సదరు బాధితుడు దెబ్బలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.