manchala police station
-
ప్రేమ, పెళ్లి అంటూ కట్నం తీసుకొని ఇప్పుడేమో..
మంచాల: ప్రేమించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించు తిరుగుతున్నాడని యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మార మల్లేశ్ బీఈడీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే మల్లేశ్ నాలుగేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు నెలల క్రితం పెళ్లి విషయమై అమ్మాయి ఒత్తిడి చేయడంతో మల్లేశ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గ్రామపెద్దలు, ఇరు కుటుంబాలకు చెందిన వారు పోలీస్స్టేషన్లో పంచాయతీ పెట్టారు. అనంతరం గ్రామపెద్ద సçమక్షంలో మల్లేశ్ తనకు రెండెకరాల భూమి, రూ.20 లక్షలు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో గ్రామపెద్దలు ఎకర భూమి, రూ.10 లక్షలు కట్నం ఇప్పిస్తామని ఒప్పించారు. రూ.2 లక్షలు నగదు అప్పుడే కట్నం కింద మల్లేశ్కు ఇచ్చారు. అప్పుడే పోలీస్స్టేషన్ ఆవరణలో వారిద్దరూ పూలదండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మంచి రోజులు లేవు. మంచి రోజుల్లో పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి చెబుతూ వస్తున్నాడు. ఇలా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని శుక్రవారం గ్రామంలో పంచాయతీ పెట్టి నిలదీశారు. అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలని పట్టుబట్టడంతో ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చారు. రాత్రంతా ఇంట్లో ఉన్నారు. అయితే శనివారం తెల్లారేలోగానే తనకు పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి వద్దంటూ అమ్మాయిని తీసుకొని మల్లేశ్ పోలీస్స్టేషన్ వచ్చాడు. ఇలా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం పోలీస్స్టేషన్ చేరింది. అమ్మాయి మాత్రం మల్లేశ్నే పెళ్లి చేసుకుంటానని, తనకు న్యాయం చేయాలని కోరుతుంది. అమ్మాయి కుటుంబసభ్యులు కూడా తమ కూతురుకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
సీఐ వేధించాడని..!
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం మంచాల: గ్రామంలో తలెత్తిన చిన్న గొడవను పరిష్కరించుకుంటామన్నా వినకుండా స్టేషన్కు తీసుకెళ్లి సీఐ దూషించాడన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండలం లోని బండలేమూర్లో ఇరుగుపోరుగున ఉండే గొడ్డటి మల్లయ్య, ముచ్చర్ల శివయ్యల మధ్య ఇంటి స్థలం విషయంలో ఇటీవల ఓ చిన్నగొడవ జరిగింది. దీంతో శివయ్య, కుటుంబ సభ్యులపై ఈ నెల 19న మం చాల పోలీస్స్టేషన్లో కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను స్టేషన్కు తరలించారు. గొడవను గ్రామంలో రాజీ చేసుకుంటామని శివయ్య కుటుంబీకులు సీఐను కోరారు. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు శివయ్య కుటుం బీకులను ఠాణాలోనే ఉంచి రాత్రి వదిలేయడంతో ఇంటికి వెళ్లారు. సీఐ తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన శివయ్య.. కుటుంబీకులు నిద్రించిన తర్వాత ఇంటి ఎదుట ఉన్న ఓ కట్టెకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ దురుసుగా ప్రవర్తించడం తో శివయ్య మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడని మృతుడి భార్య, గ్రామస్తులు ఆరోపించారు. చిన్నగొడవ విషయంలో ఎలాంటి విచారణ జరపకుండా సీఐ వేధించారని మండిపడ్డారు. సీఐపై కేసు నమోదు చేయాలని మృతుడి కుటుంబీకులు, స్థానికులు ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్కు ఫిర్యా దు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
విచారణ పేరుతో చితక బాదారు
రంగారెడ్డి(మంచాల): విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి ఓ వ్యక్తిని పోలీసులు చితక బాదారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. ఓ యువకుడిని పోలీసులు కేసు దర్యాప్తులో స్టేషన్కు పిలిపించారు. తర్వాత ఏమైందో ఏమో వీపుపై చితక బాదారు. దీంతో సదరు బాధితుడు దెబ్బలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లికి ప్రియుడి నిరాకరణ, ప్రియురాలి ఆత్మహత్య
రంగారెడ్డి: పెళ్లికి ప్రియుడు నిరాకరించడాని మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం బండలేమూరులో సోమవారం వెలుగుచూసింది. ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోమని నిలదీసింది. అందుకు ప్రియుడు నిరాకరించడంతో ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రియుడుపై మంచాల పోలీస్ స్టేషన్లో మృతురాలి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.