చిన్న చింతకుంట : మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) లక్ష్మణ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం సాయంత్రం మండల తహశీల్దారు కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఓ రైతు నుంచి రూ.4,500 లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ముందు రూ.6వేలు డిమాండ్ చేసి.. రూ.4,500 తీసుకునేందుకు అంగీకరించిన వీఆర్వో ఏసీబీకి దొరికిపోయారు.