ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి | ACB officers caught to the Panchayat Secretary | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

Published Thu, Jul 3 2014 3:28 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి - Sakshi

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

వెంకటాపురం : వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ వెంకటాపురం పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. ఈ సంఘట న గణపురం మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకు వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని రామాంజాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తడుక శ్రీనివాస్ కొన్ని నెలల నుంచి వెంకటాపు రం పంచాయతీ కార్యద ర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే గణపురం మండల కేం ద్రంలో నివాసముంటున్న శ్రీనివాస్ రోజు రెండు గ్రామాల్లో పాలన కార్యక్రమాలను చూస్తున్నాడు. కాగా, మండల కేంద్రంలోని తాళ్లపాడు శివారులో పంబిడి మాధవరావు అనే వ్యక్తి ఇటీవల వాటర్‌ప్లాంట్‌ను నిర్మించుకుంటున్నాడు.
 
 అయితే ప్లాంట్ నిర్మాణానికి అనుమతి కావాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కు అతడు జూన్ 18న దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, ప్లాంట్‌కు అనుమతి ఇవ్వాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలని శ్రీనివా స్.. మాధవరావును డిమాండ్ చేశాడు. అయితే తన వద్ద అంత డబ్బులేదని చెప్పడంతో కనీసం రూ.5 వేలైనా ఇవ్వాలని కోరాడు. దీంతో కార్యదర్శి వేధిం పులు భరించలేని మాధవరావు కుమారుడు శ్రీధర్‌రావు జూన్ 30న ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం శ్రీధర్‌రా వు కార్యదర్శికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పా డు. దీంతో ఆయన గణపురం ఆంధ్రాబ్యాంకు వద్ద కు రమ్మని చెప్పాడు. ఈ క్రమంలో శ్రీధర్‌రావు ఏసీ బీ అధికారులతో కలిసి బ్యాంకు వద్దకు వెళ్లి శ్రీనివాస్‌కు రూ.5వేలు ఇస్తుండగా వారు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వెంకటాపురం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.  కార్యక్రమంలో  సీఐ రాఘవేందర్‌రావు, సిబ్బంది జనార్ధన్, రాజయ్య పాల్గొన్నారు.
 
అవినీతిపరుల సమాచారం ఇవ్వండి :
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా ప్రజలకు సూచించా రు. పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరుల తో  ఉద్యోగులు లంచం అడిగితే 94404 46146 ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement