'అచ్చంపేట ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు' | achampeta MLA gave troubles me, says panuganti mathew johnson | Sakshi
Sakshi News home page

'అచ్చంపేట ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు'

Published Sun, Jun 28 2015 3:29 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

'అచ్చంపేట ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు'

'అచ్చంపేట ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు'

పంజగుట్ట: అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ స్టేట్ ఆయూష్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు పానుగంటి మాథ్యూ జాన్సన్ ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆయూష్ డిపార్ట్‌మెంట్‌లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ రెన్యూవల్ విషయమై 2012 జనవరి 14న సెక్రెటరియేట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కె.సమ్మయ్యను తాను సంప్రదించగా.. రూ.10 వేలు లంచం అడిగారని చెప్పారు. దీంతో తాను ఏసీబీతో సమ్మయ్యను పట్టించానని జాన్సన్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జోక్యం చేసుకున్నారని తెలిపారు.

ఈనెల 18న సాయంత్రం 7.53 నిమిషాలకు నం. 9912315315 నుంచి ఎమ్మెల్యే కాల్ చేసి.. సమ్మయ్య నాకు తమ్ముడు లాంటివాడని, అతడిని ఈ కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని కోరగా తాను నిరాకరించానని చెప్పాడు. దీంతో ఆయన  తాను ఎమ్మెల్యే హోదాలో మాట్లాడుతున్నాననే విషయం గుర్తుంచుకోవాలని, నేను చెప్పినట్టు వినాలని బెదిరించారని ఆరోపించారు.  ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో రికార్డులను ఏసీబీ డీజీకి అందించగా, ఆయన తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement