కొరుక్కుపేట(చెన్నై): 50 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటి శ్రీదేవి కి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి ఊర్వశి శారద డిమాండ్ చేశారు. చెన్నైలోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియే షన్ (ఆస్కా) ఆధ్వర్యంలో గురువారం శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు. సంస్మ రణ సభలో నటి శారద మాట్లాడుతూ.. శ్రీదేవితో కలసి పని చేసిన గత స్మృతు లను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవిని పప్పి అని ముద్దుగా పిలిచేదాన్ని అని తెలిపారు.
శ్రీదేవి నాలుగో ఏటే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 5 దశాబ్దాల పాటు అందం, అభినయంతో కోట్లాది అభి మానులను సంపాదించుకున్నారని కొని యాడారు. ఆమెకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తున్నానని అన్నారు. కార్యక్రమం లో ఆస్కా సాంస్కృతిక కార్యదర్శి వాసూ రావు, జాయింట్ సెక్రటరీ జేకే రెడ్డి, గేయ రచయిత వెన్నెలకంటి పాల్గొన్నారు.
శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి: శారద
Published Fri, Mar 2 2018 5:03 AM | Last Updated on Fri, Mar 2 2018 8:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment