Bharath rathna
-
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
-
3 లక్ష్యాలు.. 3 అవార్డులు!
‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్‌తో ఆ రాష్ట్రంలో కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్‌ముఖ్‌కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్‌ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం. ఎన్నికల ఎత్తుగడే కానీ.. ‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్‌ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్‌కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
తెలుగు తేజాన్ని మరిచారా?
భీమదేవరపల్లి : బహుభాషా కోవిదుడిగా, మౌనమునిగా, రాజనీతిజ్ఞుడిగా పేరుగడించి భారతదేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అధిరోహించి తెలుగుఖ్యాతిని దేశవిదేశాల్లో ఇనుమడింపజేసిన తెలుగు తేజం, వంగర ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా పీవీ జయంతి, వర్ధంతి వేడుకలను హైదరాబాద్‌తోపాటుగా ఆయన జన్మస్థలమైన వంగరలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ హామీ వంగరలో నెరవేర్చకపోవడంతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పీవీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పూర్వ కరీంనగర్ జిల్లా(ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా) భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకే వన్నె తెచ్చారు. పీవీ ప్రధాని కానున్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరగడంతో పాటుగా నిత్యం రాష్ట్ర, కేంద్ర మంత్రుల పర్యటనలతో సందడిగా ఉండేది. పీవీ ప్రధాని అయ్యాక వంగలో సీసీ రోడ్లు, గ్రంథాలయం, గురుకుల పాఠశాల, తాగు నీటి బావి, పోలీస్‌స్టేషన్ తదితర అభివృద్ధి పనులు జరిగాయి. దీక్షలు చేసినా శూన్యమే.. పాలకులు మరిచినా ఇక్కడి ప్రజానీకం మాత్రం పీవీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే కాబోలు వంగరలో 2013 సంవత్సరం పీవీ విగ్రహాన్ని చందాలతో ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వచ్చినా.. రాకున్నా వారే జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకుంటున్నారు. పీవీ మరణం నుంచి నేటి వరకు ఆయనకు ఏదోవిధంగా అవమానం జరుగుతూనే ఉంది. పీవీకి భారత రత్న ఇవ్వాలని, జిల్లాకు పీవీ పేరు పెట్టాలని, ఢిల్లీలో శాంతి వనం ఏర్పాటు చేయాలని ఆయన 9వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని పీవీ విగ్రహం వద్ద ప్రజలు రాజకీయాలకతతీంగా 48 గంటల పాటు దీక్ష చేపట్టినా ఏ నాయకుడు అటుగా రాలేదు. వెలవెలబోతున్న విగ్రహం వంగరలో పీవీ నర్సింహారావు విగ్రహ నిర్మాణ సమయంలో గార్డెన్‌ను నిర్మిస్తామంటూ నాయకులు ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు. నూతన రాష్ట్రంలో పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను స్వగ్రామం వంగరతో పాటుగా హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేవలం మొదటి సంవత్సరం మాత్రమే జయంతి వేడుకలకు ఆర్డీఓ హాజరయ్యారు. అనంతరం ఆ కార్యక్రమాలను మరిచిపోయారు. ఈనె ల 28న పీవీ జయంతి సందర్భంగా అధికారిక ఏర్పాట్లు లేకపోవడంతో వంగర బోసిపోయింది. -
శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి: శారద
కొరుక్కుపేట(చెన్నై): 50 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటి శ్రీదేవి కి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి ఊర్వశి శారద డిమాండ్ చేశారు. చెన్నైలోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియే షన్ (ఆస్కా) ఆధ్వర్యంలో గురువారం శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు. సంస్మ రణ సభలో నటి శారద మాట్లాడుతూ.. శ్రీదేవితో కలసి పని చేసిన గత స్మృతు లను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవిని పప్పి అని ముద్దుగా పిలిచేదాన్ని అని తెలిపారు. శ్రీదేవి నాలుగో ఏటే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 5 దశాబ్దాల పాటు అందం, అభినయంతో కోట్లాది అభి మానులను సంపాదించుకున్నారని కొని యాడారు. ఆమెకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తున్నానని అన్నారు. కార్యక్రమం లో ఆస్కా సాంస్కృతిక కార్యదర్శి వాసూ రావు, జాయింట్ సెక్రటరీ జేకే రెడ్డి, గేయ రచయిత వెన్నెలకంటి పాల్గొన్నారు. -
సెలబస్: స్వదండకం
కథ, మాటల రచయితగా, దర్శకుడిగా... తెలుగు, కన్నడం, తమిళ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు జనార్దన మహర్షి. కవిగా తన కలం నుంచి ఎన్నో అక్షర సుమాలను వెదజల్లారు. మహర్షి ఫ్లూటిస్ట్ కూడా! వీణ, వయొలిన్లపై సంగీతాన్ని పలికించే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి త్వరలో ఒక కచేరీ ఇవ్వాలన్నది ఆయన లక్ష్యం. ప్రియాతి ప్రియమైన పద్మశ్రీ ‘భారతరత్న’ నాకు నేను రాసుకొను ప్రేమలేఖ ఇదే నా మొదటి ప్రేమలేఖ ఎవ్వరికీ రాయనేలేదింత దాకా. ‘నీ’ ప్రేమలో పడి ‘నాకే’ రాస్తున్నా. నన్నడిగారు... ‘నీకెవరంటే ఇష్టమని’ ‘నేనే’ అన్నాను. అంతేకదా... రాజకీయాలైనా రాసక్రీడలైనా, రచనలైనా, సం‘గీతా’లైనా అరువది నాలుగు కళల్లో ఎవడైనా నాకు ఇష్టంగా ఉండాలంటే ముందు వాటిని ఇష్టపడే నాకు నేను ఇష్టుడిగా ఉండాలి కదా! ‘ఎలా ఉన్నావ్’ అని అడిగాడతను ‘నువ్వెలా కోరుకుంటే అలా’ అన్నాను. నాకు నేనెందుకింత ఇష్టమో చెప్పాను ఎందుకంటే... నే స్వయంభుని విల్లంభుని... హయంభుని... జయంభుని నేను తెరిచిన నగలపెట్టెని ఎవరైనా ధరించొచ్చు కానీ నిష్ర్కమించేటప్పుడు నేలపైన, నెలరాజు లాంటి నన్నూ, పెట్టెని వదిలివెళ్లు. పెకైళితే... నగల నగరమే ఉందిగా సూర్యుడికీ చంద్రుడికీ తెలీని సంధి సమయంలో నేను భయాన్ని ఉరివేసి, దుఃఖాన్ని ఎన్కౌంటర్ చేసి, నిరాశకి తలకొరివి పెట్టాను. ఇది మీకూను లాభసాటి. తిరుగులేని ‘తిక్క’ నా సొంతం గొడుగు తడుస్తుందని వర్షంలో విప్పను చెప్పు కాలుతుందని ఎండలో తొడగను ఎందుకిలా అంటే... అంటాను ‘చెప్పు’నేనే... ‘ముళ్లు’ నేనే... ‘వర్షం’ నేనే తడిస్తే వచ్చే జలుబు నేనే. మందు చిటీ రాసే వైద్యుణ్ని, దాన్ని వాడక చింపే పేషెంట్‌ని, అన్నీ నేనే... అదే ‘నువ్వే’నని! హరిని... కరిని... కరిమింగిన వెలగని వెలగ మొలచిన చెట్టుని పెరిగే దేహాన్ని, తరిగే శరీరాన్ని అన్నీ ‘నేనే’... ‘నువ్వే’నని. అత్యధిక అపజయాలని సాధించడంలో నీ అంత విజయుడు లేడు నేనెంత పాతాళంలో ఉన్నానంటే భూమ్మీద ఉన్న మనుషులు నాకు ఆకాశం ఎత్తులో ఉంటారు ఆత్మహత్య చేసుకుందామనే వాళ్లందరూ కూడా నీతో నాలుగు నిమిషాలు గడిపితే... వీడే బతికేస్తున్నాడనే ధైర్యంతో నిండు నూరేళ్లు మిగులుతారు. ఆఖరుగా ఓ మాట. నీకు నేను చెప్పేదేంటంటే... ‘‘ఇష్టం లేకపోతే... ఉలక్కు... పలక్కు... అంతేగానీ కెలక్కు’’... అంతే నేనెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటా.