రాయికల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోలోరాంతో పాటు త్రిదండి చిన్నజీయర్‌స్వామి సోమవారం రారుుకల్ మండల కేంద్రానికి విచ్చేస్తున్నారు. ఇక్కడ చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు కేసీఆర్, విద్యాసాగర్‌రావు, జోలోరాం ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరుతారు.
11.15 గంటలకు రాయికల్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడినుంచి కొమరం భీమ్ విగ్రహావిష్కరణ ప్రాంతానికి విగ్రహావిష్కరణ చేస్తారు. చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్‌కు చేరుకొని వృత్తివిద్యాశిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ట్రస్ట్ ఆవరణలో నిర్మించనున్న కల్యాణమండపానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
12.45 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరబాద్‌కు పయనమవుతారు.
ఏర్పాట్లు పూర్తి : అతిరథుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ తెలిపారు. ఆదివారం డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ శివకుమార్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్‌లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వీరివెంట అదనపు జేసీ నాగేందర్, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, స్థానిక తహశీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో గీత, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీపీ పూర్ణిమ ఉన్నారు.
భారీ బందోబస్తు : సీఎం పర్యటన సందర్భంగా రారుుకల్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీఐజీ మల్లారెడ్డి తెలిపారు. పర్యటన పూర్తయ్యేంత వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బందోబస్తు కోసం ఆరుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలు, 81 మంది ఏఎస్సైలు, 275 మంది కానిస్టేబుళ్లు, 140 మంది హోంగార్డులు, 59 మంది మహిళా హోంగార్డులు, 70 మంది ఆర్మీ సిబ్బంది నియమించినట్టు తెలిపారు. ఆయన వెంట జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
విజయవంతానికి సహకరించాలి : సీఎం కేసీఆర్, గవర్నర్ విద్యాసాగర్‌రావు రారుుకల్ పర్యటనను విజయవంతం చేయూలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ కోరారు. ఆదివారం ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సభకు నియోజకవర్గంలోని ఆయూ మండలాల నుంచి 15వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల నాయకులు మోర హన్మండ్లు, శ్యాంసుందర్‌రావు తదితరులున్నారు.
అతిరథుల రాక నేడే
Published Mon, Mar 2 2015 3:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement