
డప్పులతో అడవిబాట పడుతున్న ఆదివాసీలు
కెరమెరి(ఆసిఫాబాద్): గడిచిన పక్షం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిన గుస్సాడీ సంబరాలు సోమవారం ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో కోలబోడి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ఆదీవాసీలు ఇప్పచెట్టు వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేశారు. ఏత్మాసూర్ దేవతకు పూజలు చేశారు. గుస్సాడీలు నెమలి పింఛం టోపీ, దుడ్డు, జింక చర్మం, కాళ్ల గజ్జెలు, ఆభరణాలు, పోరీలు, దండారీలు దాండియా కర్రలు, దుస్తులు, డప్పులకు ప్రత్యేక పూజలు చేశారు. కులదేవతలకు మొక్కుకున్నారు. సమీపంలో ఉన్న గంగా, గోదావరి, పెద్ద వాగుల్లో స్నానాలు చేశారు.

దీక్ష విరమణ తర్వాత అడవిలో కొనసాగుతున్న సామూహిక పూజలు
Comments
Please login to add a commentAdd a comment