
నాలుగుకు చేరిన మృతులు
తండ్రి మృతితో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్య చేసుకోగా..అది తట్టుకోలేక అదే కుటుంబంలోని మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు.
- ఆత్మహత్యాయత్నం ఘటనలో యువతి మృతి
- ఒకే కుటుంబంలో నలుగురి మరణంతో విషాదచాయలు
వెంగళరావునగర్,న్యూస్‌లైన్: తండ్రి మృతితో మనస్తాపం చెందిన కుమార్తె ఆత్మహత్య చేసుకోగా..అది తట్టుకోలేక అదే కుటుంబంలోని మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. వరంగల్‌జిల్లా జనగామకు చెందిన గాదె శ్రీనివాస్ కుటుంబం బోరబండ సైట్-3లోని ఎన్‌ఆర్‌ఆర్‌పురంలో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
అయితే శ్రీని వాస్ భార్య హేమలత,కుమారుడు శివ,పెద్దకూతురు స్వాతి మంగళవారం రాత్రి మృతి చెందగా చిన్నకూతురు శ్వేత(19) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. ముగ్గురి అంత్యక్రియలు బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటికలో పూర్తిచేయగా.. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి గురువారం అంత్యక్రియలు జరుపుతామని పెదనాన్న రవీందర్ తెలిపారు.
బోరబండలో విషాదచాయలు : ఒకే ఇంట్లో నలుగురు మృతిచెందడంతో బోరబండ సైట్-3లో విషాదచాయలు అలుముకున్నాయి. బుధవారం ఎక్కడ చూసినా దీని గురిం చే చర్చించుకోవడం కనిపించింది. కాగా స్థానిక ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి ఇతర నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఎస్సార్‌నగర్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.