పంచాయతీ ఏఈకి ‘సైబర్’ టోకరా
- ఖాతా నుంచి రూ. 40 వేలు మాయం
- కొత్త ఏటీఎం కార్డు ఇస్తామని బురిడీ
తాండూరు రూరల్: ఓ సైబర్ నేరగాడు పంచాయతీ ఏఈకి టోకరా వేశాడు. కొత్త ఏటీఎం కార్డు ఇస్తామని ఆయన నుంచి వివరాలు తీసుకొని ఖాతా నుంచి దాదాపు రూ. 40 వేలు మాయం చేశాడు. ఈ సంఘటన తాండూరు మండలంలో అలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి కథనం ప్రకారం.. తాండూరు మండల పంచాయతీ ఏఈగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మహహ్మద్ ఇషాక్ పని చేస్తున్నారు. ఈ నెల 4న ఆయన విధుల్లో ఉండగా 7050009820 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఁనేను శరణ్‌జిత్‌శర్మ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను.
మీ ఏటీఎం కార్డు చెడిపోయింది.. కొత్త కార్డు ఇస్తున్నా ము... కార్డు వివరాలు చెప్పండి అని అన్నా డు. దీంతో తన ఏటీఎం కార్డు నిజంగానే చెడిపోయిందేమోనని భావించిన ఏఈ ఇషాక్ వివరాలు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ నెల 6న ఇషాక్ డబ్బుల అవసరం రావడంతో తాం డూరు పట్టణంలోని ఏటీఎంకు వెళ్లాడు. తన ఖాతాలో డబ్బులు లేకపోవడంతో స్టేట్ బ్యాం క్ ఆఫ్ హైదరాబాద్ తాండూరు బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి ఏఈ ఇషాక్‌కు తెలియకుండా ఓసారి రూ.31,990, మరోసారి రూ.8,800 డ్రా చేసుకున్నట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు.