జక్రాన్‌పల్లి: పింఛన్లు రావడం లేదని సోమవారం మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వృద్ధులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలో చాలా మందికి పింఛన్లు రాలేదని పేర్కొంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు.
సర్పంచ్ సాయన్న,ఉపసర్పంచ్ రమేష్‌లను ఇరవై నిమిషాల పాటు గదిలో నిర్బం ధించి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైనప్పటికీ తమకు పింఛన్ జాబితాలో పేరు లేదని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా మంది పింఛన్లను అధికారులు తొలగించారని ఆరోపించారు. అర్హులైన తమకు పింఛన్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.
పింఛన్ల కోసం వృద్ధుల ఆందోళన
Published Tue, Nov 25 2014 3:11 AM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
Advertisement
Advertisement