జోగుళాంబ ఆలయంలో అమిత్‌షా భార్య పూజలు  | Amit Shah WIfe Pray At Jogulamba Temple | Sakshi
Sakshi News home page

జోగుళాంబ ఆలయంలో అమిత్‌షా భార్య పూజలు 

Published Wed, Jan 30 2019 2:02 AM | Last Updated on Wed, Jan 30 2019 2:02 AM

Amit Shah WIfe Pray At Jogulamba Temple - Sakshi

జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): జోగుళాంబ గద్వాల జిల్లా లోని అలంపూర్‌ శ్రీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆల యాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సతీమణి సోనాలి షా మంగళవారం సందర్శించారు . ఈ సందర్భంగా ఆమెకు దేవస్థానం ఈఓ గురురాజ, అర్చకులు ఘన స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరుడికి ఆమె ముందుగా మహారుద్రాభిషేకం చేశాక జోగుళాంబ అమ్మవారికి ఖడ్గమాల అర్చన చేయించారు. పూజల అనంతరం అర్చకులు అమ్మవారి జ్ఞాపికలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ పూజల్లో పాల్గొన్న బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement