- తెలంగాణ వాహన చట్టానికి సవరణ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ విధులను కూడా డ్రైవర్ నిర్వర్తించేలా మోటారు వాహనాల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. లెసైన్స్ లేకుండా కండక్టర్ విధులను డ్రైవర్ నిర్వర్తించకూడదనే నిబంధనను సడలించింది. సంబంధిత నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ రవాణాశాఖ మం గళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ బస్సు ల్లో డ్రైవర్లకు టిమ్ మిషన్లు ఇచ్చి కండక్టర్ విధులు చేయాలని పురమాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు కార్మికులు గతంలో కోర్టును ఆశ్రయిం చారు. చట్టంలో మార్పులు చేయకుండా డ్రైవర్లతో కండక్టర్ విధులు చేయించటం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టసవరణ చేసింది. నోటిఫికేషన్‌లో కొన్ని అంశాలను పొందుపరిచింది. డ్రైవర్ కచ్చితంగా 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలని, ప్రథమ చికిత్సకు సం బంధించి నిర్ధారిత సర్టిఫికెట్ ఉండాలని, లెసైన్స్‌ను డ్రైవర్ వద్ద ఉంచుకుని తనిఖీ అధికారులకు చూపించాలి. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్/జీపీఆర్‌ఎస్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.