కాళేశ్వరానికి బ్యాంకు రుణం
సుమారు రూ.7వేల కోట్లు ఇచ్చేందుకు ఆంధ్రాబ్యాంక్ సుముఖత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఏర్పాటైన కార్పొరేషన్‌కు సుమారు రూ.6వేల నుంచి రూ.7వేల కోట్ల రుణాలిచ్చేందుకు ఆంధ్రాబ్యాంకు సుముఖత తెలిపింది. పూర్తి నిధులను ఒక్కసారిగా ఇస్తుం దా, లేక వారుుదాల పధ్దతినా అనేది స్పష్టత రాలేదు. మరో భేటీలో దీనిపై తేల్చాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణరుుంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌తో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80వేల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం 2022 లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఏటా రూ.8వేల నుంచి రూ.10వేల కోట్ల నిధులు అవసరం.
ఇలా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుకు రూ.6వేల కోట్లు కేటారుుంచారు. ఇందుకుగాను ప్రపంచబ్యాంకు, జపాన్‌బ్యాంకు, నాబార్డు, ఎల్‌ఐసీ సహా ఇతరత్రా మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకోవాల్సిన దృష్ట్యా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన, పనుల మదింపు, నిధుల విడుదల,అమలు, నిర్వహణ,పర్యవేక్షణ, మొత్తం బాధ్యతలను ఈ కార్పొరేషన్‌కే ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ప్రాజెక్టు సమగ్ర రూపం కొలిక్కి రావడంతో నిధుల సమీకరణకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగానే శుక్రవారం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, ప్రాజెక్టు సీఈ హరిరామ్‌లు ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులతో భేటీ అయ్యారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు అధికారులు రూ.8 వేల కోట్ల రుణాన్ని కోరగా.. రూ.7వేల కోట్ల వరకు వారుుదా పద్ధతుల్లో ఇస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. తమకు తక్కువ వడ్డీరేట్లతో ఒకే విడతలో ఇస్తే ప్రయోజనం ఉంటుందని శాఖ అధికారులు చెప్పడంతో, దీనిపై త్వర లో స్పష్టత ఇస్తామని బ్యాంకు ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. కాగా పాలమూరు నిధులపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.