ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామకృష్ణ కాలనీ నుంచి కరీంనగర్ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశముందని టీడీపీ నేత విజయరమణా రావు తెలిపారు.
ఈ పర్యటన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ధర్నా నేపథ్యంలో జిల్లాలో పోలీసులను భారీగా మోహరించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉన్న హోటల్ వద్ద పోలీసులను మోహరించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది.