అనుకున్నదొక్కటి.. అయినది.. | Anukunnadokkati ..'s .. | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి.. అయినది..

Published Fri, Mar 14 2014 3:18 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

Anukunnadokkati ..'s ..

 తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన వెంటనే ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఆశావహులు ఆరాట పడుతున్నారు. స్థానిక పోరులో ఎవరికీ ఈ అవకాశం దక్కనుందోనని పలువురు వేచి చూస్తున్నారు.
 

ఆశావహులకు భంగపాటు
 

ఎన్నికలకు ముందు సందడి చేసిన నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మెత్తబడ్డారు. రాజకీయంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ప్రజలతో సంబంధాలు పెంచుకుని పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చిన వారు ఎన్నికల వేళ నిమ్మకుండిపోయారు. రాజ కీయంగా ఎదగడానికి దోహదపడే ప్రాదేశిక ఎన్నికలు రావడం, అదీ పార్టీ గుర్తులతో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నాయకుల్లో నెలకొన్న నిరుత్సాహం ఏమిటీ అని ఆరా తీస్తే మాత్రం రిజర్వేషన్లు తెచ్చిన తంటానేనని తెలుస్తోంది.

ఊహించని విధంగా స్థానిక రిజర్వేషన్లు ఖ రారు కావడంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బడా నేతల వెంట పరుగులు పెడుతున్నారు. రిజర్వేషన్లతో అన్ని వర్గాల నేతలకు అవకాశం కలిసి వచ్చినా ఆశపడ్డ వారికి మాత్రం భంగపాటుకు గురి చేశాయి. ఇందులో కవ్వాల్ నుంచి విడదీసి కామన్‌పల్లికి ప్రత్యేక స్థానం కల్పించారు. అయితే కామన్‌పల్లిలో అత్యధికంగా బీసీ, వెల్మ కులస్తులు పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండగా అనుకోకుండా ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఆశావహులు భంగపడ్డారు.

అదే విధంగా అత్యధికంగా ఓసీ, బీసీలు ఉన్న దేవునిగూడ ఎంపీటీసీ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడంతో రాజకీయాలు తలకిందులయ్యాయి. అంతే కాకుండా ఎంపీపీ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు అర్హత గల మహిళల కోసం వెదుకులాట ప్రారంభించారు.  అవకాశం రాని వారు మెత్తబడిపోగా, అనుకోని విధంగా అవకాశం రావడంతో కొందరు ఎగిరి గంతేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement