జాతి గర్వించదగిన నేత ‘బాబు’ | ap cm chandrababu birthday clebartions | Sakshi
Sakshi News home page

జాతి గర్వించదగిన నేత ‘బాబు’

Published Thu, Apr 21 2016 1:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ap cm chandrababu birthday clebartions

వరంగల్ : ప్రణాళికబద్ధంగా పాలించే తెలుగు జాతి గర్వించదగిన రాజనీతిజ్ఞడు చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చంద్రబాబు 67వ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.  కేక్‌ను కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో ముందుంచి అంత ర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు.


భవిష్యత్ దేశ రాజకీయాల్లో బాబు కీలక భూమిక పోషిస్తారని అన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం మాట్లాడుతూ క్రమ శిక్షణకు, జవాబుదారు తనానికి మారపేరు చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూరి అశోక్‌కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, నాయకులు బాస్కుల ఈశ్వర్, తాళ్లపల్లి జయపాల్, జాటోత్ సంతోష్‌నాయక్, మార్గం సారంగం, బాబా ఖాదర్‌అలీ, మార్క విజయ్, రహీం పాల్గొన్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement