హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణ, రావెల కిషోర్ బాబు రాష్ట్రపతితో ఈ రోజు భేటీ కాబోతున్నారు.
సెక్షన్ -8 అంశం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 లోని ఉమ్మడి సంస్థల వివాదాలపై ప్రణబ్ ముఖర్జీకి ఈ భేటీలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. శీతాకాల విడిది కోసం ప్రణబ్ హైదరాబాద్ లోని బొల్లారంలో ఉంటున్న విషయం విదితమే.
రాష్ట్రపతితో భేటీకానున్న ఏపీ మంత్రులు
Published Tue, Jul 7 2015 10:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement